కేసీఆర్ పై జానారెడ్డికి కూడా కోపం వచ్చింది

Published : Oct 07, 2017, 03:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కేసీఆర్ పై జానారెడ్డికి కూడా కోపం వచ్చింది

సారాంశం

సీఎం పై విరుచుకుపడ్జ జానారెడ్డి  కాంగ్రెస్ , తెలంగాణ పెద్దలపై వాడిన బాష అభ్యంతరకరం సీఎం తన హోదాను మరిచిపోయి మాట్లాడారు  

సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, వాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సింగరేణి విజయం గురించి మాట్లాడి ఉంటే బావుండేది కానీ, కాంగ్రెస్ పైన,తెలంగాణ పెద్దల పైన అసభ్య పదజాలంతో మాట్లాడటం సీఎం పదవి హుందాతనాన్ని పోగొట్టేలా ఉన్నాయన్నారు.  నేను ఇపుడు చేప్పే మాటలన్నీ ప్రజలకోసమేనన్నారు.  టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు చెప్పినా వినే సంస్కారం లేదని ఘాటుగా విమర్శించారు. ఇంకా జానారెడ్డి ఏం మట్లాడారో ఆయన మాటల్లోనే... చదవండి
ప్రజలకు విజ్ఞప్తి..ఈ మాటలు  సీఎంకు గానీ, వారి పార్టీకి చెప్పినా వృధా.. అందుకే మీతోనే మాట్లాడుతున్నా...

ప్రజలారా..భారతీయలారా ఆలోచన చెయ్యండి..
అనేక కేంద్ర ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్ లు తెలంగాణ కు ఇచ్చింది కాంగ్రెస్.. 
అలాంటి నెహ్రూ, ఇందిరా, సోనియా లపై సీఎం మాట్లాడిన తీరు బాధాకరం,  అభ్యంతరకరం..
తెలంగాణ అమరవీరుల బలిదానాల మీద మదన పడి.. ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా తెలంగాణ ఏర్పాటు చేసిన తల్లి సోనియా . ఆమె మీద మాట్లాడిన తీరు దారుణం..ప్రజలు గమనించాలి.
మోసపు మాటలు, కుట్రలు, అధికారం కోసం  అర్రులు చాచడం తమకు తెలీదు.  
1991 లో తెలంగాణ ఫోరమ్ లో ఏర్పడినపుడు తాను ఎప్పుడు పదవి అడగలేదు.. దీనికి మాజీ ఎమ్మెల్సీ...వెల్చాల జగపతి రావు సాక్ష్యం..  మేము తెలంగాణ కోసమే చేసాము.. 
అప్పుడు మంత్రి పదవి వద్దన్నా కూడా కోట్ల.. నాకిచ్చారు.. అయినా.. ఫోరమ్ లో చెప్పాను.. 
ఎన్టీ రామారావు .. 35 మంది ఎమ్మెల్యేలను డిస్మిస్ చేసి పొలిట్ బ్యూరో ఇచ్చిన..పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది.. 
రాజకీయ నాయకుల గురుంచి, సీఎం పదవి కోసం కూడా చులకనగా  మాట్లాడుతున్నారు..  వచ్చే తరం కోసం కూడా ఆలోచన చెయ్యాలి.. 
విలువలు కాపాడటానికే.. సంయమనం పాటిస్తున్నాం.. 
కాంగ్రెస్ అగ్రభాగాన నిలపడకపోతే.. రాష్ట్రం రావడం దుర్లభం.. మేము పోటీ   చెయ్యమని  కూడా చెప్పాము..
కాంగ్రెస్ అధినేత సోనియా  నమ్మినం,ఆంధ్ర నేతల ఒత్తిడి తట్టుకుని  తెలంగాణ కోసం ఓపిక పట్టినం.. తెలంగాణ వచ్చింది.. అప్పుడు అవమానాలు పడ్డాం.. ఇప్పుడు అవమానాలు పడుతున్నాము..
జేఏసీ ఏర్పాటు ..విషయం మాట్లాడితే..నేను, కేసీఆర్ ఇద్దరం మాట్లాడాలి.. ఎవరికి వారు వారి రూపాల్లో తెలంగాణ కోసం పోరాటం చేసాము . 
 తెలంగాణ ఉద్యమంలొ అందరి పాత్ర ఉంది..  సాధించింది అందరూ.. ప్రజల యొక్క సాధన ఇది.. ఎవరి పోరాటం వారి రూపం లో ఉన్నది.. 
అహంభావ పడటం సరైనది కాదు.. 
నేను , కేసీఆర్ ఇద్దరమే మాట్లాడి కోదండరాం ను చైర్మన్ గా పెట్టాము.. కేసీఆర్ ప్రతిపాదన నేను ఆమోదించాను..
మా మ్యానిఫెస్టో  కోదండరాం రాయడమేంటి.. ఆయనెప్పుడు మా మనిషి కాదు..
కేసీఆర్ ను నమ్ముకోవడం వల్లే మా పని ఇలా అయింది...కోదండరిం వల్ల కాదు 
గద్దర్, పొత్తూరి, చుక్కా రామయ్య ,రాధాకృష్ణ ఇలా అందరినీ.. సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్లి తెలంగాణ కోసం టైం ఇప్పించాను. 
ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే..  గెలిపించనీ.. 
ప్రతిపక్షంగా.. మేము మా బాధ్యతగా..  ప్రజల్ని గమనించమని కోరుతాము.. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము..
చిల్లర పార్టీలు టోకు పార్టీలు.. ఐతాయి.. టోకు పార్టీలు చిల్లర పార్టీలు.. ఐతాయి.. టోకు పార్టీ అవ్వగానే చిల్లరగా మాట్లాడటం.. తగదు.. 
సీఎం మాటలతో కలత చెందా.. కలవరం చెందా..ఇలాంటి సమాధానం.. చెప్పాడా.. అని అనుమానం వస్తోంది.. 
మంచి పనులను ప్రజలు గుర్తిస్తారు.
 ఇకపై టీఆర్ఎస్ అహంకారానికి కళ్లెం పడే రోజులు త్వరలోనే వస్తాయి.వారి అక్రమాలపై శిక్షను ఆ   దేవుడే నిర్ణయిస్తాడు.
 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu