
నిజామాబాద్ జిల్లా : Nizamabad జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద హైదరాబాద్-నాగ్ పుర్ జాతీయ రహదారి మీద బుధవారం Torn currency(నోట్ల తుక్కు) కుప్పలు కుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. లారీ నుంచి కిందపడిన సంచి పై నుంచి వాహనాలు వెళ్లడంతో తుక్కు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అవి అసలైనవా? నకిలీ నోట్లా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘సాధారణంగా RBI పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. దీన్ని బట్టి అది black moneyనో లేదా counterfeit noteలు అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నాం’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు !
ఇదిలా ఉండగా, డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23, గురువారం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. శుక్రవారం, డిసెంబర్ 24 వరకు రూ. 150 కోట్ల నగదును ఐటీ అధికారులు లెక్కించారు. డిసెంబర్ఇం 25 వరకు కౌంటింగ్ కొనసాగింది. అయితే, ఆ వ్యాపారితో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తో సంబంధాలు ఉండటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇంటితో పాటు ఆయన వ్యాపారాలకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే అఖిలేష్ యాదవ్ తో సంబంధాలు కలిగివున్న పియూష్ జైన్ ఇంట్లో ఇంత భారీ మొత్తంలో గుట్టల కొద్ది నోట్ల కట్టలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
అధికారుల వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన ప్రముఖ పాన్ మసాలా తయారీదారుడు, ట్రాన్స్ పోర్టు వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఇండ్లు, కార్యాలయాలపై డిసెంబర్ 23,24 తేదీల్లో జీఎస్టీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అయితే, అధికారులు సైతం విస్తుపోయేలా 150 కోట్ల రూపాయలకు పైగా నగదు కట్టలు బయట పడ్డాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, ముంబైల్లోని పీయూష్ కార్యాలయాల్లోనూ, అనుచరుల ఇళ్లలోనూ అధికారులు ఈదాడులు జరిపారు.
అధికారులు సోదాలు నిర్వహించిన మొత్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో నోట్ల కట్టలు లభించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. భారీగా నోట్ల కట్టలు బయటపడటంతో బ్యాంకు సిబ్బంది, నోట్ల లెక్కింపు యంత్రాలన పదుల సంఖ్యలో అధికారులు తీసుకెళ్లారని తెలిసింది.