తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 235 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో అత్యధికం

Siva Kodati |  
Published : Dec 29, 2021, 09:17 PM IST
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులో 235 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో అత్యధికం

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 235 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల నిన్న ఎవరూ (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోలేదు. 204 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,490 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 38,023 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 235 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,81,307కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 204 మంది కోలుకున్నారు. దీంతో కలిపి తెలంగాణలో మొత్తం రికవరీల సంఖ్య 6,73,793కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,490 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 346 మంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 10 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తం 12,267 మంది తెలంగాణకు వచ్చారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 121, జగిత్యాల 2, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 5, ఖమ్మం 2, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 1, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 0, రంగారెడ్డి 31, సిద్దిపేట 3, సంగారెడ్డి 6, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 9, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి

 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం