పోలీస్ కేసు: పరారీలో భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్

By narsimha lodeFirst Published Feb 13, 2019, 3:46 PM IST
Highlights

ఇండియా హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్‌పై సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు బుధవారం నాడు  కేసు నమోదు చేశారు.ముఖేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

ఇండియా హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్‌పై సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు బుధవారం నాడు  కేసు నమోదు చేశారు.ముఖేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నకిలీ ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ముఖేష్ కుమార్ పొందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ముఖేష్ కుమార్‌పై పోలీసులు రెండు వారాల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ముఖేష్ సోదరుడు సురేష్‌పై కూడ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నాయీ బ్రహ్మణ కులానికి చెందిన ముఖేష్  నకిలీ పత్రాల ద్వారా ఎస్పీ కుల ధృవీకరణ పత్రాన్ని పొందినట్టుగా పోలీసులు గుర్తించారు.

2007లోనే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విజిలెన్స్ అధికారులు అప్పటి హైద్రాబాద్ కలెక్టర్‌ను కోరారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైద్రాబాద్ కలెక్టర్ 2018 నవంబర్ మాసంలో సికింద్రాబాద్ తహసీల్తార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ కుమార్ ధరఖాస్తు చేసుకొన్నాడు. ఈ సమయంలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో ధరఖాస్తు చేసుకొన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది.

బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ముఖేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. ముఖేష్‌తో పాటు ఆయన సోదరుడు సురేష్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఇండియన్ హాకీ జట్టుకు ముఖేష్ కుమార్‌కు కొంతకాలంగా కెప్టెన్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ముఖేష్ కుమార్ అర్జున అవార్డును కూడ ఇచ్చింది.

 

click me!