తండ్రి పుట్టినరోజు వేడుకలపై కేటీఆర్ ట్వీట్...కార్యకర్తలకు సూచన

Published : Feb 13, 2019, 04:01 PM IST
తండ్రి పుట్టినరోజు వేడుకలపై కేటీఆర్ ట్వీట్...కార్యకర్తలకు సూచన

సారాంశం

ఈ నెల 17వ వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ  అభిమాన నాయకుడి జన్మధిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సిద్దమయ్యారు. అయితే తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు ఏవిధంగా తమ అభిమానాన్ని చాటుకుంటే భావుంటుందో కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వివరించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ బ్యానర్లు, హోర్డింగ్ లో ఏర్పాటు చేయవద్దని కేటీఆర్ నాయకులకు,కార్యకర్తలకు సూచించారు. ఇలా బ్యానర్లకు, అడ్వర్టయిజ్‌మెంట్లకు డబ్బును వృధా చేయవద్దని... ఏవిధంగా శుభాకాంక్షలు చెబితే తన తండ్రి ఆనందిస్తాడో కేటీఆర్ వెల్లడించారు. 

ప్రతిఒక్కరు ఓ మొక్కను నాటడం ద్వారా తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్‌పై వున్న ప్రేమను చాటుకోవాలని సూచించారు. ఇలా చేస్తే ఆయన చాలా ఆనందిస్తారని కేటీఆర్ తెలిపారు. అందువల్ల ఈనెల 17 న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకోవాలని కేటీఆర్ సూచించారు. 
 
PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?