తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఓ సినిమా నిర్మాత,రచయితను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. చిత్ర పరిశ్రమకు పట్టుకున్న మత్తు వదలడం లేదు. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆదివారంనాడు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంతెన వాసువర్మ అనే సినీ దర్శకుడిని ఈనెల ఐదవ తేదీన మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే డ్రగ్స్ కేసులో సినీ రచయిత మన్నేరి పృథ్వికృష్ణ అలియాస్ దివాకర్, పూణేకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అశోక్ తెలోర్ లు గత జూన్ లో అరెస్టు అయ్యారు.
పూణేలో ఉంటున్న రాహుల్ అశోక్ తెలోర్, ముంబైకి చెందిన విక్టర్లు పరిచయస్తులకు డ్రగ్స్ అమ్ముతుంటారు. వీరిద్దరి నుంచి నార్సింగిలో ఉండే పృథ్వీకృష్ణ డ్రగ్స్ కొనేవాడు. వినియోగించేవాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు పృథ్వీకృష్ణ, రాహుల్ లను జూన్ 19న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి దగ్గర నుంచి 70 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
undefined
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ.. ఎక్కడంటే ?
వారు ఇచ్చిన సమాచారంతో ‘బస్తీ’ సినిమా దర్శక నిర్మాత.. ఓ ట్రస్టుకు చైర్మన్ అయిన శేరీలింగంపల్లిలో ఉండే మంతెన వాసువర్మ కూడా డ్రగ్స్ కొంటాడని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు ఈనెల 5వ తేదీన వాసువర్మను అరెస్టు చేశారు. పృథ్వి కృష్ణ, వాసు వర్మ డ్రగ్స్ వాడుతున్నట్లుగా గుర్తించామని.. దీంతో అరెస్టు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. వీరిద్దరికి డ్రగ్స్ సరఫరా చేసిన విక్టర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఈ కేసును రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.