సెల్‌ఫోన్‌  పోయిందని యువకుడి ఆత్మహత్య.. 

Published : Sep 25, 2023, 04:31 AM IST
సెల్‌ఫోన్‌  పోయిందని యువకుడి ఆత్మహత్య.. 

సారాంశం

వేల రూపాయలు పెట్టి కొన్న సెల్ ఫోన్‌ పోయిందని ఓ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. దాంతో. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

నేటి తరం యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. కాస్తా ఒత్తిడిని కూడా తట్టుకోలేపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో.. సెల్‌ఫోన్ కొనివ్వలేదనో.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. అనే చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి చిన్నా.. పెద్ద సమస్యకు ఆత్మహత్య పరిష్కారమని భావిస్తున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా.. చావుతో చెలగాటం ఆడుతున్నారు. 

తాజా ఓ యువకుడు సెల్‌ఫోన్‌ పోయిందని మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పరిధిలోని కేటీఆర్‌ కాలనీలో చోటుచేసుకుంది. మృతుడిని నీతీష్‌రాజ్‌ (26)గా గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్