తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మెగా ప్లాన్ ప్రకటించారు. తమది 2050 విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను పునరుద్ధరిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే అని, ప్రపంచ దేశాలకూ ఈ విషయం తెలుసు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Dwakra Sangham: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అమలైందని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని నిలిపేసిందని ఫైర్ అయ్యారు. మహిళలందరినీ తమ ప్రభుత్వం మహాలక్ష్మీలుగా చూస్తున్నదని వివరించారు. అంగన్వాడీ, హాస్టల్ వర్కర్లు, ఏఎన్ఎంలకు 18 నెలలుగా జీతం పడలేదని తన దృష్టికి వచ్చిందని, రిపీట్ కాకుండా చూసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ వృద్ధికి మెగా ప్లాన్
undefined
హైదరాబాద్ నానక్ రామ్‌గూడలో నిర్మించిన రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వాలు అన్నీ నగరాల అభివృద్ధికి ప్లాన్లు వేశాయని, కానీ, తాము మొత్త తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్ వేస్తున్నామని వివరించారు. అర్బన్, సెమీ అర్బర్, రూరల్‌గా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అధికారం మళ్లీ మాదే: మోడీ
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ప్రపంచ దేశాలన్నీ తమను ఆహ్వానిస్తున్నాయని, ఎందుకంటే మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వారికి ఉన్నదని వివరించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ సదస్సుల్లో మాట్లాడుతూ.. ఈ 100 రోజులు చాలా కీలకం అని, ప్రతి ఒక్క ఓటరును కలిసి మనం ప్రవేశపెట్టిన పథక లబ్దిదారులను కన్విన్స్ చేయాలని చెప్పారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతర కోసం హెలికాప్టర్ ట్యాక్సీలు.. ఎలా బుక్ చేయాలంటే?
అంతరిక్షంలోకి అణ్వాయుధం?
రష్యా దేశం అంతరిక్షంలోకి అణ్వాయుధం పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. అంతరిక్షంలో పేలిస్తే అక్కడ ఐఎస్ఎస్ కూడా పేల్చేసే అవకాశలం ఉన్నది. ముందుగా ఈ అణ్వాయుధాన్ని కక్ష్యలోకి పంపి వదిలిపెట్టేలా ఉన్నది. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించనున్నట్టు తెలిపారు. ఈ ఆరోపణలు అమెరికా చేసింది. అయితే.. ఈ వార్తలను రష్యా ఖండించింది.
చర్చకు సిద్ధమా?: చంద్రబాబు
జగన్ పై చంద్రబాబు విసుర్లు సంధించారు. సిద్ధమా అనే నినాదాన్ని తీసుకుని జగన్ రూ. 100ల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అధికార దుర్వినియోగంతో సభలు పెడుతున్నదని చంద్రబాబు చెప్పారు. చర్చకు సిద్ధమా జగన్.. ఎవరి అభివృద్ధి పాలన ఎలా ఉన్నదో చర్చిద్దామా? స్వర్ణ యుగమా; రాతి యుగమా చూడవచ్చని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పై నమోదైన ఖేసును ఆయన ఖండివారు.
రేపటి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలను డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. మూడు చోట్ల నుంచి ప్రారంభమై హైదరాబాద్‌లో ముగిసే ఈ యాత్రలు రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఎన్నికల్లో కనీసం 10 లోక్ సభ సీట్లు గెలుచుకోవాలని, 35 శాతం ఓటు సంపాదించుకుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
Also Read: Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రికి వరుసగా మూడు రోజుల సెలవు
ఇంట్లో ఉండేది ఫ్యానే: జగన్
అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. విపక్ష నేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లపై ఆయన పంచ్‌లు విసిరారు. చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు జగన్. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే వుండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే వుండాలని , తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే వుండాలని సీఎం సెటైర్లు వేశారు.