Marri Janardhan Reddy: సొంత డబ్బులతో స్కూల్ నిర్మించిన మాజీ ఎమ్మెల్యే

By Mahesh K  |  First Published Feb 19, 2024, 1:15 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా సిర్సావాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డి ఉన్నత పాఠశాల భవనాలను నిర్మించి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 


Ex MLA: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి సొంత డబ్బులతో స్కూల్ కట్టించాడు. రూ. 2.50 కోట్లతో ఆయన ఉన్నత పాఠశాలను నిర్మించారు. ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం సిర్సావాడ గ్రామంలో ఈ స్కూల్‌ను నిర్మించారు.

ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవాన్ని మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

Latest Videos

Also Read: Medaram Jatara: మేడారం జాతర కోసం హెలికాప్టర్ ట్యాక్సీలు.. ఎలా బుక్ చేయాలంటే?

తాను చదువుకున్న స్కూల్‌ను తానే నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వివరించారు. తన చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించిన ఆ స్కూల్ చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

click me!