దేశ రాజధానిలో బిఆర్ఎస్ జాతీయ కార్యాలయం... కేసీఆర్ అరుదైన ఘనత

Published : May 04, 2023, 11:21 AM IST
దేశ రాజధానిలో బిఆర్ఎస్ జాతీయ కార్యాలయం... కేసీఆర్ అరుదైన ఘనత

సారాంశం

దేశ రాజధాని న్యూడిల్లీలో కేంద్ర కార్యాలయం ఏర్పాటుచేసిన తొలి తెలుగు ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. 

న్యూడిల్లి : తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ రాజధాని న్యూడిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేసేందుకు ఏ తెలుగు ప్రాంతీయ పార్టీ చేయని పని కేసీఆర్ చేసి చూపించారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిపై యుద్దం ప్రకటించిన కేసీఆర్ ఇక డిల్లీలోనే తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా డిల్లీలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. 

డిల్లీలో పార్టీ కార్యలయం ఏర్పాటు ద్వారా బిఆర్ఎస్ అరుదైన ఘనత సాధించింది. గతంలో తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినా డిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోలేకపోయింది. మరే తెలుగు రాష్ట్రాలకు చెందిన స్థానిక పార్టీకి ఇప్పటివరకు డిల్లీలో కార్యాలయాలు లేవు. ఇలా జాతీయ కార్యాలయాన్ని డిల్లీలో ఏర్పాటుచేసిన తొలి తెలుగు పార్టీ  బిఆర్ఎస్. 

జాతీయ స్థాయికి తగ్గట్లుగానే డిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా నిర్మించినట్లు తెలుస్తుంది. పార్టీ పనులపై డిల్లీకి వెళ్లే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు బస చేసేందుకు గదులను నిర్మించారు. అలాగే పార్టీ ఎంపీలు, ఇతర నాయకులు సమావేశాలు నిర్వహించుకునేలా, ప్రెస్ మీట్స్ పెట్టుకునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటుచేసారు. అలాగే కార్యాలయానికి వచ్చే నాయకులు భోజనం కోసం బయటకు వెళ్లకుండా క్యాంటిన్ ఏర్పాటుచేసారు. 

Read More  ఢిల్లీకి కేసీఆర్: నేడు బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించనున్న సీఎం

ఇలా మొత్తం 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిల్లీలోని వసంత విహార్ లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేసారు. ఈ బిఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన డిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుండి బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పండితులు పూజలు నిర్వహిస్తున్నారు. మద్యాహ్నం 1.05 గంటలకు మంచి ముహూర్తం వుండటంతో  కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 

బిఆర్ఎస్ జాతీయ కార్యాలయంలోని ఏ ప్లోర్ లో ఏముందంటే : 

గ్రౌండ్ ప్లోర్ లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు కేటాయించారు. అలాగే రిసెప్షన్, క్యాంటిను కూడా ఈ ప్లోర్ లోనే వున్నాయి. 

డిల్లీలోని బిఆర్ఎస్ జాతీయ కార్యాలయం మొదటి అంతస్తును పార్టీ అధినేత కేసీఆర్ కోసం కేటాయించారు. పార్టీ అధ్యక్షుడు కార్యాలయంతో పాటు నాయకులు, అధకారులతో సమావేశం అయ్యేందుకు కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటుచేసారు.

రెండు, మూడు అంతస్తుల్లో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు డిల్లీకి వచ్చిన సమయంలో బస చేసేందుకు 18 గదులను ఏర్పాటుచేసారు. ఈ గదుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసారు. ఇందులో రెండు ప్రత్యేక సూట్ రూంలు, ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి