తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. న్యూఢిల్లీలో నేడు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 1:05 గంటలకు న్యూడిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీలో సర్ధార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ కు తాత్కాలిక కార్యాలయం ఉంది. స్వంత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం పూర్తైంది. ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరారు.
దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ తలపెట్టారు. దీంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈసీ కూడా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా చూస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు బహిరంగ సభలు నిర్వహించింది బీఆర్ఎస్,. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఢీల్లీ కేంద్రంగా బీజేపీయేతర పార్టీలు, నేతలను కలిసేందుకు కేసీఆర్ రానున్న రోజుల్లో మరింత సమయం కేటాయించనున్నారు.