తెలంగాణ కరోనా అప్ డేట్... హైదరాబాద్, రంగారెడ్డి పోటా పోటీ

By Arun Kumar PFirst Published Oct 8, 2020, 9:15 AM IST
Highlights

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,896మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,644కి చేరగా టెస్టుల సంఖ్య 33,96,839కి చేరాయి. 

ఇప్పటికే కరోనా సోకినవారిలో 2,067 మంది ఈ మహమ్మారి నుండి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,79,075కి చేరింది. ఇలా రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.65శాతంగా వుంటే దేశవ్యాప్తంగా ఇది 85.2శాతంగా వుంది. 

ఇక ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1201కి చేరింది. కరోనా మరణాలు రేటు రాష్ట్రంలో 0.58శాతంగా వుంటే దేశంలో ఇది 1.56శాతంగా వున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26,368గా వుంది. హోం ఐసోలేషన్ తో పాటు ఐసోలేషన్ కేంద్రాల్లో వున్నవారి సంఖ్య 21,724గా వుంది. 

read more  తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృతి... ఒక్కరోజే భారీగా కేసులు

జిల్లాల వారిగా చూసుకుంటే జీహెచ్ఎంసీ(హైదరాబాద్) లో 294 కేసులు నమోదవగా దీనికి పోటీపడితున్నట్లుగా రంగారెడ్డిలో కూడా 211 కేసులు బయటపడ్డాయి. ఇక మేడ్చల్ 154, నల్గొండ 126, సిద్దిపేట 100, భద్రాద్రి కొత్తగూడెం 82, కరీంనగర్ 97, ఖమ్మం 79, మహబూబాబాద్ 55, సూర్యాపేట 57 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే వుంది. 

click me!