ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలి: సోలిపేట సుజాతకు కేసీఆర్ సూచన

Siva Kodati |  
Published : Oct 07, 2020, 10:12 PM IST
ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలి: సోలిపేట సుజాతకు కేసీఆర్ సూచన

సారాంశం

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సోలిపేట సుజాత బుధ‌వారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త‌న ఎంపిక ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఆమె సీఎం నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. 

సుజాతకు సీఎం పార్టీ బి ఫామ్ ని అందజేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం పాటుప‌డాల‌ని జరగబోయే  ఉపఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పారు.

బీ ఫామ్ అందుకున్న సుజాత మాట్లాడుతూ సోలిపేట రామలింగారెడ్డి గారికి ఇచ్చిన ప్రోత్సహం , ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తా అని సుజాత ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే