తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594కి చేరింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. గత 24గంటల్లో ఈ మహమ్మారి బారిన 1,983మంది పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594కి చేరింది.
ఇప్పటికే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 1,383మంది కోలుకున్నారని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,74,769కి చేరింది. ఇక ఈ మహమ్మారి బారినుండి బయటపడలేక గత 24గంటల్లో 10మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1181కి చేరింది.
undefined
దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.6శాతంగా వుండగా రాష్ట్రంలో మాత్రం 0.58శాతంగా వుంది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 84.7శాతంగా వుంటే తెలంగాణలో అది 86.26శాతంగా వుంది.
read more తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా... 2లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా గత 24గంటల్లో 50,598 మందికి టెస్టులు నిర్వహించగా రెండువేలకు చేరువలో కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 32,92,195కి చేరింది.
ఇక జిల్లాలవారిగా కరోనా కేసులను పరిశీలిస్తే... జిహెచ్ఎంసీ(హైదరాబాద్)292, రంగారెడ్డి 187, మేడ్చల్ 145, ఖమ్మం 117, కరీంనగర్ 109, నల్గొండ 105 కేసులతో టాప్ లో నిలిచాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 85, కామారెడ్డి 56, నిజామాబాద్ 62, సిద్దిపేట 89, సూర్యాపేట 75, వరంగల్ అర్బన్ 75 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 50 కంటే తక్కువగానే కేసులు బయటపడ్డాయి.
పూర్తి వివరాలు
Telugu Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 06.10.2020) pic.twitter.com/wBRkBEYpBA
— Dr G Srinivasa Rao (@drgsrao)