పైశాచికం: రెండో భార్య కూతురిపై టెక్కీ అత్యాచారం

Published : Oct 06, 2020, 08:18 AM ISTUpdated : Oct 06, 2020, 08:19 AM IST
పైశాచికం: రెండో భార్య కూతురిపై టెక్కీ అత్యాచారం

సారాంశం

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు రెండో భార్య కూతురిపై కన్నేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని మేడ్చెల్ జిల్లా నేరేడుమెట్ లో జరిగింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చేల్ జిల్ాల నేరేడుమెట్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు దారుణానికి పాల్పడ్డాడు. రెండో భార్య కూతురిపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జయరాం అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు విభేదాలతో భార్యతో విడాకులు తీసుకున్నాడు. 

ఒంటరితనాన్ని భరించలేక ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమెకు అప్పటికే 17 ఏళ్ల వయస్సు గల కూతురు ఉంది. కూతురిని బంధువుల వద్ద ఉంచుతానని వివాహమైన తర్వాత మహిళ చెప్పింది. అయితే జయరాం అంగీకరించలేదు. తన కూతురిలాగానే చూసుకుంటానని అతను నమ్నించాడు.

దాంతో కూతురిని ఆమె బంధువుల దగ్గరి నుంచి ఇంటికి తీసుకుని వచ్చింది. కూతురిలాంటి ఆమెపై జయరాం కన్నేశాడు. తల్లి లేని సమయంలో బెదిరించి లైంగిక దాడి చేశాడు. విషయం భార్యకు తెలిసింది. దీంతో ఆమె బంధువుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

భర్తకు భయపడిన ఆమె బాలికను తన బంధువుల ఇంటి వద్ద ఉంచింది. అప్పటికే రెండో భార్యపై ఆగ్రహంతో ఉన్న జయరాం బాలికను దూరం చేయడంతో భరించలేకపోయాడు. బాలికను తన వద్దకు తీసుకుని రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. వేధించడం ప్రారంభించాడు. 

అతని వేధింపులు భరించలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?