మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్.. బీఆర్ఎస్‌లోకి త్వరలో ఎంట్రీ?

By Mahesh K  |  First Published Oct 19, 2023, 10:39 PM IST

మామిళ్ల రాజేందర్ దరఖాస్తు చేసుకున్న వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే మామిళ్ల బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టు సమాచారం. ముదిరాజ్ వర్గానికి చెందిన మామిళ్ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ పిలుచుకుని రాజీనామా సూచన చేసినట్టు తెలిసింది.
 


హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ మరో వ్యూహాన్ని అమలు చేయనుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఒక్కరూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు లేరు. దీంతో ఈ వర్గం నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. బీసీ కమ్యూనిటీలో ముదిరాజ్ వర్గం బలమైనది. ముదిరాజ్ వర్గం నుంచి అసమ్మతికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి,  ఈ నష్టాన్ని నివారించడానికి పరిష్కారం మార్గాన్ని ఆలోచించింది. ఈ వర్గం నుంచి బలమైన అభ్యర్థి, పార్టీకి అనుకూలమైన నేత కోసం అన్వేషించగా.. బీఆర్ఎస్‌కు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్‌జీవో) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కనిపించినట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ ముదిరాజ్ వర్గానికి చెందిన మామిళ్ల రాజేందర్‌ను పిలిపించుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించినట్టు తెలిసింది. దీంతో మామిళ్ల రాజేందర్ వెంటనే శుక్రవారం స్వచ్ఛంద పదవీ విరమణకు వైద్య, ఆరోగ్య కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వీఆర్ఎస్‌కు ఆమోదం లభించింది. 

Latest Videos

undefined

Also Read: TS Assembly : ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేత.. తెలంగాణలో బీజేపీ వ్యూహం ?

దీంతో మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్‌లోకి చేరడం లాంఛనమే అని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మామిళ్ల రాజేందర్‌ను బీఆర్ఎస్‌లోకి చేర్చుకుని, ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. 1987లో ఉద్యోగం చేరిన మామిళ్ల వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. సంగారెడ్డికి చెందిన ఆయనకు మరో రెండేళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్‌కు అప్లై చేశారు.

click me!