ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి స్థానం దక్కింది . స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో గెలిచి లోక్‌సభ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలక నేతలను రంగంలోకి దించి గెలిపించే బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు.. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి స్థానం దక్కింది. మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్‌లుగా ఎంపిక చేయగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సంజయ్ ఒక్కరికే చోటు కల్పించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వున్నారు.
తెలంగాణ అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత బండి సంజయ్‌కి జాతీయ కార్యవర్గంలో బీజేపీ చోటు కల్పించిన సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు సైలెంట్‌గా వున్న బండి సంజయ్.. ఇటీవల మళ్లీ స్పీడు పెంచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ పైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కనిపించడం లేదని తమకు కేటీఆర్ పైనే అనుమానంగా వుందని.. ముఖ్యమంత్రిని ఒక్కసారి చూపించాలంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే చేపల పులుసు తెలంగాణ ప్రజలను ముంచింది ఆయన చేసిన కామెంట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో సంజయ్ మరింత రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
छत्तीसगढ़ विधानसभा चुनाव 2023 के लिए भाजपा के स्टार प्रचारकों की सूची चुनाव आयोग में संलग्न की गयी। pic.twitter.com/9A58xroKMV
— BJP Chhattisgarh (@BJP4CGState)