ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు.. ఐఎండీ ఏం చెప్పిందంటే..?

By Mahesh RajamoniFirst Published Mar 16, 2024, 8:03 AM IST
Highlights

Telangana rains : తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హైద‌రాబాద్ తెలిపింది. ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. 
 

Telangana weather: తెలంగాణ‌లోని ప్ర‌స్తుతం ఎండ‌లు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల సెల్సియ‌స్ దాటుతున్నాయి. అయితే, శ‌నివారం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఎండ‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం లభించ‌నుంది. ఎందుకంటే ప‌లు జిల్లాల్లో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. అలాగే, ఈదురు గాలులు వీస్తాయ‌ని భార‌త వాతార‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

ఐఎండీ-హైద‌రాబాద్ కేంద్రం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తెలంగాణలో శ‌నివారం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. రాజ‌ధాని ప్రాంతంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

KAVITHA’S ARREST: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు.. !

కాగా, శుక్ర‌వారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. పాటిగడ్డలో అత్యధికంగా గురువారం 40.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. అయితే, రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఐఎండీ అంచ‌నా వేసిన వ‌ర్షాలతో ప్ర‌జ‌ల‌కు ఊరటనిస్తుందో లేదో చూడాలి.

దేశంలోని కొండ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో వాతావరణ సరళి మారడం మొదలైందని ఐఎండీ తెలిపింది.  ఐఎండీ త‌న ప్ర‌క‌ట‌న‌లో రాబోయే 72 గంటలు వాతావరణ పరంగా చాలా ముఖ్యమైనవిగా పేర్కొంది. మార్చి 16 నుంచి 18 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచ‌నా వేసింది.  కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం కూడా ఉంది. రానున్న కాలంలో తూర్పు, మధ్య భారతంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు, మధ్య భారతదేశంలో రబీ పంటల‌కు న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చ‌ని తెలిపింది. ప‌లు ప్రాంతాల్లో పంట కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిసినా, వడగండ్ల వాన కురిసినా రైతులు తీవ్రంగా నష్టపోతారు.

WPL 2024 : ముంబై చిత్తు.. ఫైన‌ల్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

click me!