యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అతి ఉత్సాహం చూపారు. కారుపై ఉన్న వెయ్యి రూపాయాల చలానా చెల్లించిన తర్వాతే కారును వదిలిపెట్టారు. అయితే ఈ కారులో ఆసుపత్రికి తరలిస్తున్న మూడు మాసాల చిన్నారి ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్లడంతో చిన్నారి మరణించినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
యాదగిరిగుట్ట: Yadadri Bhuvanagiri జిల్లాలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరు మూడు మాసాల పసికందు మరణానికి కారణమైంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jangaon జిల్లా మరిగడి గ్రామానికి చెందిన దంపతులు తమ మూడు మాసాల చిన్నారిని హైద్రాబాద్ కు తీసుకెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.ఈ కారులో చిన్నారిని Hyderabad కు తరలిస్తున్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కారు ప్రవేశించింది. యాదాద్రికి సమీపంలోని వంగపల్లి వద్ద Traffic కానిస్టేబుళ్లు ఈ కారును నిలిపారు. కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా కారును ఆపారు. ఈ కారుపై పెండింగ్ చలాన్లు చెక్ చేస్తే రూ. 1000 కూడా ఉంది. అయితే ఈ పెండింగ్ చలాను చెల్లిస్తేనే కారును వదిలేస్తామని కారును నిలిపివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
undefined
Carపై రూ. 1000 చలానా ఉందని కారు డ్రైవర్ కు చెప్పారు. అయితే కారులో ఉన్న మూడు మాసాల చిన్నారికి అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెంటనే హైద్రాబాద్ కు తరలించాలని కారు డ్రైవర్ తో పాటు చిన్నారి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల దృష్టికి తీసుకు వచ్చారు.
అయితే కారుపై ఉన్న చలానా కట్టిన తర్వాతే ట్రాఫిక్ police కారును వదిలిపెట్టారు. సుమారు అరగంటపాటు కారును అక్కడే నిలిపివేశారు. అయితే ఆసుపత్రికి ఆలస్యంగా చిన్నారిని తరలించడంతో చిన్నారి మరణించినట్టుగా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.
పోలీసులు వ్యవహరించిన తీరును మృతుడి కుటుంబ సభ్యులు తప్పు బడుతున్నారు. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పినా కూడా వినకుండా తమను ఇబ్బందులకు గురి చేశారని కూడా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారని మరో తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. మూడు మాసాల చిన్నారి మీతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వలిపిస్తున్నారు.
కారు డ్రైవర్ నుండి లైసెన్స్ తీసుకెళ్లారు: చిన్నారి తల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద కారును ట్రాపిక్ పోలీసులు నిలిపివేశారు. కారుపై ఉన్న చలాన్ చెల్లిస్తేనే వదిలివేస్తామని చెప్పారని చిన్నారి తల్లి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. డ్రైవర్ వద్ద ఉన్న లైసెన్స్ ను కూడా పోలీసుల తీసుకెళ్లారని కూడా ఆమె ఆరోపించింది. తన మూడు నెలల చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందన్నారు. అయితే నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ప్రారంభంచే సమయంలో చిన్నారిని మరణించినట్టుగా ఆమె వివరించారు. కనీసం 10 నిమిషాల ముందు ఆసుపత్రికి తీసుకొచ్చినా తమ చిన్నారి బతికేదని వైద్యులు చెప్పారన్నారు.వంగపల్లి వద్ద పోలీసులు అరగంటపాటు తమ కారును నిలిపివేయకపోతే చిన్నారి బతికేదన్నారు.
కారులో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉందని చెప్పలేదు: ట్రాఫిక్ పోలీసులు
మంగళవారం నాడు వంగపల్లి వద్ద మోటకొండూరు క్రాస్ రోడ్డు వద్ద తమ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో జనగామ జిల్లా నుండి వస్తున్న కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే తమ సిబ్బంది ఆపారని ట్పాఫిక్ ఎస్ఐ చెప్పారు. అయితే ఈ కారుపై వెయ్యి రూపాయాలు పెండింగ్ చలానా ఉన్న విషయాన్ని గుర్తించాామన్నారు. ఈ విషయమై డ్రైవర్ ను ప్రశ్నిస్తే కారు ఓనర్ తో మాట్లాడారన్నారు. ఈ పెండింగ్ చలానాను తర్వాత చెల్లిస్తానని వాహన యజమాని సమాధానం ఇచ్చారని కారు డ్రైౌవర్ చెప్పడంతో తమ సిబ్బంది కారును వదిలేశారన్నారు. కారులో మూడు మాసాల చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయం తమకు తెలియదన్నారు. ఈ విషయం తెలిస్తే తాము వారికి సహకరించే వాళ్లమని ట్రాఫిక్ ఎస్ఐ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.