పోలీసులను తిడుతూ, దాడి చేస్తూ.. ఉస్మానియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు వీరంగం..

Published : Jun 01, 2022, 06:39 AM IST
పోలీసులను తిడుతూ, దాడి చేస్తూ.. ఉస్మానియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు వీరంగం..

సారాంశం

ఉస్మానియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. పోలీసుల్ని తిడుతూ, దాడికి దిగుతూ హల్ చల్ చేశాడు. దీంతో పేషంట్స్ భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్ : Liquor మత్తులో రాహుల్ అనే యువకుడు hyderabad జియాగూడలో రోడ్ల మీద వెళ్లే vehiclesను అడ్డుకుంటూ హంగామా చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న police నిందితుడిని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు పోలీసులను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించాడు. అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసుల మీద దాడికి యత్నించాడు. ఈ ఘటనతో hospitalలోని రోగులతో పాటు వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు తాగుబోతుకు వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తు దిగాక అతన్ని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, మే 27న ఉత్తరప్రదేశ్ లో ఓ మర్డర్ కేసు మిస్టరీని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఛేదించాడు. Uttar Pradeshలోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి.. హంతకులను పట్టుకోవడంలో పోలీసులకు ఓ Alcohol lover ఇచ్చిన సమాచారం చాలా ఉపయోగపడింది. దాడి జరిగినపుడు హంతకులు వచ్చిన బైక్ రంగును, రిజిస్టేషన్ నంబరుతో కొంత భాగాన్ని మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాక్షికంగా గుర్తుంచుకుని, పోలీసులకు చెప్పడంతో హంతకులను పట్టుకోగలిగారు. సెంట్రల్ నోయిడా అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎలమారన్ జీ తెలిపిన వివరాల ప్రకారం, ఫేజ్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని భంగేల్ నివాసి అభయ్ త్యాగి, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రి వేళలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వీరంతా మద్యం సేవించి ఉన్నారు. 

ఆ సయమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్ లపై అక్కడికి వచ్చారు. వీరి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడి చేసుకోవడంతో త్యాగి మరణించారు. ఆ ముగ్గురు బైక్ లపై పారిపోయారు. ఈ సంఘటన మే 14న రాత్రి జరిగింది. నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఆధారాలు దొరకడం లేదు. అయితే, మృతుని స్నేహితుల్లో ఒకరు ఈ సంఘటన జరిగినప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పటికీ నిందితులు వచ్చిన ఓ బైక్ నెంబర్ ను పాక్షికంగా గుర్తుంచుకున్నారు. అదేవిధంగా దాని రంగును కూడా గుర్తుంచుకున్నారు. UP 16 CH వరకు మాత్రమే ఉందని, ఆ బైక్ రంగు నల్లగా ఉందని చెప్పారు. 

మరొక ఆధారం ఏదీ లభించకపోవడంతో.. UP 16 CH, నల్లరంగు ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. గౌతమ్ బుద్ధ నగర్ లో రిజిస్ట్రేషన్  చేయిస్తే యూసీ 16 సిరీస్ నెంబర్ వస్తుంది. భంగేల్, దాని పరిసరాల్లోని గ్రామస్తులు రిజిస్ట్రేషన్ చేయించిన బైక్ ల వివరాలను సేకరించారు. నల్లని రంగులో ఉన్న 100 మోటార్ బైక్ ల వివరాలను సేకరించారు. అన్ని మోటార్ సైకిళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, కొందరు యజమానులను ప్రశ్నించారు. చిట్టచివరికి మోహిత్ సింగ్ చౌహాన్ (22), వివేక్ సింగ్ (21)లను ప్రశ్నించారు. వీరిద్దరూ భంగేల్ గ్రామస్తులే. వీరి సెల్ ఫోన్ కాల్ డేటాను తనిఖీ చేశారు. తాము మే 14 రాత్రి త్యాగిని హత్య చేశామని వారు అంగీకరించారు. అనంతరం హత్యానేరం క్రింద ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మూడో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu