వాహనదారులకు అలర్ట్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుకలు.. హైదరాబాద్‎లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Siva Kodati |  
Published : May 31, 2022, 09:46 PM IST
వాహనదారులకు అలర్ట్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుకలు.. హైదరాబాద్‎లో ట్రాఫిక్‌ ఆంక్షలు

సారాంశం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు ప్రజలను కోరారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (telangana formation day)  పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసులు (hyderabad police) మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు (traffic restrictions) విధించారు. వేడుకల నేపథ్యంలో రాజ్‌భవన్‌ రోడ్డు, వీవీ విగ్రహం, ఖైరతాబాద్‌, నిరంకారి, పాత సైఫాబాద్‌ పీఎస్‌, రవీంద్రభారతి జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, నాంపల్లి రోడ్డు, తాజ్‌ ఐలాండ్‌ రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు. ట్రాఫిక్‌ను సజావుగా క్రమబద్ధీకరించేందుకు , నగరంలో కింది మార్గాల్లో మళ్లింపులు అమలు చేస్తామని వెల్లడించారు. 

  • ఎంజే మార్కెట్ నుంచి వాహనాలను పబ్లిక్ గార్డెన్ వైపు అనుమతించరు. ఈ మార్గంలోంచి వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్ , ఆసిఫ్ నగర్, రెడ్‌హిల్స్, అయోధ్య హోటల్, లక్డికాపూల్ వైపు మళ్లించనున్నారు. 
  • నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్‌ను ట్రాఫిక్ గన్‌పౌండ్రీ, అబిడ్స్ , బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్‌ ద్వారా చాపెల్ రోడ్ టీ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
  • నిరంకారి భవన్ - ఖైరతాబాద్ , రవీంద్ర భారతి వైపు వాహనాలను అనుమతించరు. ఈవైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ భషీర్‌బాగ్, అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
  • హైదర్‌గూడ, కింగ్ కోఠి, బీజేఆర్ విగ్రహం, పీసీఆర్, పబ్లిక్ గార్డెన్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇటు వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్, లిబర్టీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, లక్డికాపూల్ బ్రిడ్జ్, బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తారు. 
  • ఆదర్శ్ నగర్ (న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్) వద్ద లిబర్టీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్, తెలుగు తల్లి, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదర్శ్ నగర్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. 
  • ట్యాంక్ బండ్ నుంచి రవీంద్ర భారతి వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్, టెలిఫోన్ భవన్ రోడ్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, లక్డికాపూల్ బ్రిడ్జి వైపు మళ్లిస్తారు.
  • సుజాత స్కూల నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. ఇటువైపు వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపున్న ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు మళ్లిస్తారు. 

తాము సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి పోలీసులకు సహకరించాలని సిటీ పోలీసులు కోరారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్