క్షుద్రపూజలు చేస్తే అతీంద్రియశక్తులు సొంతమై.. కుబేరులవుతారంటూ టోకరా.. !!

Published : Aug 13, 2021, 09:54 AM IST
క్షుద్రపూజలు చేస్తే అతీంద్రియశక్తులు సొంతమై.. కుబేరులవుతారంటూ టోకరా.. !!

సారాంశం

వీరు ముగ్గురు పథకం ప్రకారం 8నెలల క్రితం మీర్ పేట్ సర్వోదయనగర్ కు చెందిన కృష్ణవేణి ఇంటికి వచ్చి వారింట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నారు. క్షుద్రపూజలు చేయడం ద్వారా ఆ శక్తులు వారి సొంతమువుతాయని చెప్పారు. అవ సొంతమైతే కుబేరులవుతారని వారిని నమ్మించారు. 

హైదరాబాద్ : మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, క్షుద్రపూజలు చేస్తే శక్తులు మీ వశమై ఐశ్వర్యం, సంపద మీకు దక్కుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ గాంధీ నగర్ కు చెందిన పిల్లి జితేందర్ (34), ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాకు చెందిన అబ్దుల్ గని (48) వృత్తిరీత్యా కార్పెంటర్.

కుషాయి గూడ చీరాగల్లికి చెందిన మహ్మద్ దస్తగిరి (35) వస్త్ర వ్యాపారి. వీరు ముగ్గురు పథకం ప్రకారం 8నెలల క్రితం మీర్ పేట్ సర్వోదయనగర్ కు చెందిన కృష్ణవేణి ఇంటికి వచ్చి వారింట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నారు. క్షుద్రపూజలు చేయడం ద్వారా ఆ శక్తులు వారి సొంతమువుతాయని చెప్పారు. అవ సొంతమైతే కుబేరులవుతారని వారిని నమ్మించారు. 

క్షుద్ర పూజలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు, నగదు ఉంచాలని తెలిపారు. వారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 11 లక్షల నగదు మూటలో కట్టి ఉంచారు. క్షుద్రపూజలు చేసిన  అనంతరం పూజ మూగిసిందని అక్కడి నుంచి జారుకున్నారు. వారు వెళ్లాక మూటను విప్పి చూడగా అందులోని బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్ గురై మోసపోయినట్లు గ్రహించారు. 

ఈ సంఘటన జరిగిన 8 నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజల పేరిట మోసపోయినట్లు తెలుసుకన్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, తెలుసుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఎలాగోలా ధైర్యం చేసి జరిగిన మోసం మీద ఆగస్ట్ 9వ తేదీన మీర్ పేట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కృష్ణ వేణి ఫిర్యాదు చేసింది. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్షుద్రపూజల పేరిట మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పిల్లి జితేందర్, అబ్దుల్ గని, మహ్మద్ జితేందర్ లను గురువారం అరెస్ట్ చేసి వారి వద్దనుంచి రూ. 2.66 లక్షల నగదు, మూడు బంగారు నాణేలు, ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?