నాగార్జునసాగర్ వ్యూహామే: హుజూరాబాద్‌లోని ఆ ఓటర్లకు సీఎం కేసీఆర్ లేఖలు

By narsimha lode  |  First Published Aug 13, 2021, 9:34 AM IST

 హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  విజయం కోసం అన్ని అస్త్రాలను టీఆర్ఎస్  ఉపయోగించుకొంటుంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీదళం అనుసరించనుంది.



హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  విజయం కోసం అన్ని అస్త్రాలను టీఆర్ఎస్  ఉపయోగించుకొంటుంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీదళం అనుసరించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్దిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా లేఖలు రాయనున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో కూడ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందిన లబ్దిదారులను కలిసి నేరుగా తమకు ఓటేయాలని టీఃఆర్ఎస్ వర్గాలు కోరాయి.

Latest Videos

undefined

 

ఇదే తరహాలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ లబ్దిదారులను కలిసి తమకు ఓటేయాలని కోరుతారు. అయితే అంతకంటే ముందే సీఎం కేసీఆర్ లబ్దిదారులకు స్వయంగా లేఖలు రాయనున్నారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతివ్వాలని టీఆర్ఎస్ కోరనుంది.

 ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందిన వారి జాబితాను టీఆర్ఎస్ సిద్దం చేసింది., ఈ జాబితా ఆధారంగా లబ్దిదారులకు కేసీఆర్ సంతకం చేసిన లేఖలను పార్టీ నేతలు పంపనున్నారు.

ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో  దళితబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఈ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సభ కంటే ముందుగానే లబ్దిదారులకు సీఎం లేఖలు చేరేలా టీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో  70 వేల మందికి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు అందాయని టీఆర్ఎస్ గుర్తించింది. వీరందరికి కూడ ఈ లేఖలు పంపనున్నారు.


 

click me!