బంజారాహిల్స్ సిటీ సెంటర్ లో మూడేళ్ల చిన్నారికి ప్రమాదం: తెగిన చేతి మూడు వేళ్లు

Published : May 07, 2023, 04:49 PM ISTUpdated : May 07, 2023, 04:55 PM IST
 బంజారాహిల్స్ సిటీ సెంటర్ లో మూడేళ్ల చిన్నారికి ప్రమాదం:  తెగిన   చేతి  మూడు వేళ్లు

సారాంశం

హైద్రాబాద్   బంజారాహిల్స్  సిటీ సెంటర్  ప్లేజోన్ లో గల మెషీన్ లో  మూడేళ్ల చిన్నారి చేయి పడింది.ఈ ఘటనలో  మూడు చేతివేళ్లు తెగిపోయాయి.  

హైదరాబాద్:నగరంలోని  బంజారాహిల్స్  సిటీ సెంటర్ లో  ప్లే జోన్ లో  మూడేళ్ల  చిన్నారికి ప్రమాదం  జరిగింది.ప్లే జోన్  మేషీన్ లో పడి  మూడేళ్ల చిన్నారికి  ప్రమాదం జరిగింది.  మూడేళ్ల పాపలకు  మూడు చేతి వేళ్లు తెగిపోయాయి.  మూడేళ్ల పాప కుడిచేతికి చెందిన  మూడు వేళ్లు తెగిపోయాయి.   పాపకు  నగరంలోని  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప చేతివేళ్ల విషయమై  వైద్యులు  ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని  పాప తండ్రి చెబుతున్నారు. బంజారాహిల్స్ సిటీ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే  తమ కూతురు చేతి వేళ్లు తెగిపోయాయని  బాధిత చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై   బాధితురాలి తండ్రి పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.  

నిన్న మధ్యాహ్నం   సిటీ సెంటర్ కు  బాధిత కుటుంబం వచ్చింది.  చిన్నారితో పాటు  ఆమె సోదరుడు కూడా ప్లే జోన్ లో ఆడుకుంటున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది.  బాధిత చిన్నారి  సోదరుడితో పాటు   మేషీన్ వద్ద  ఆడుకుంటున్న సమయంలో  చిన్నారి కుడి చేయి మెషిన్ లో పడిపోయిందని  చిన్నారి తండ్రి మీడియాకు  చెప్పారు ప్లేజోన్ వద్ద  నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించలేదని  ఆయన  ఆరోపించారు. ఈ కారణంగానే తన కూతురు  మూడు చేతివేళ్లు తెగిపోయాయయని  ఆయన  ఆరోపించారు. అయితే  చేతివేళ్లు  పనిచేస్తాయా లేదా అనే విషయమై వైద్యులు  ఇంకా ఏం చెప్పలేదని  బాధిత చిన్నారి తండ్రి  చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu