
హైదరాబాద్: పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. గోదావరిఖని(Godavarikhani)లో గంగానగర్ వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రెండు లారీలు పరస్పరం ఢీకొట్టుకుని పక్కనే ఉన్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆ ఆటలో ప్రయాణిస్తున్న దంపతులు సహా చిన్నారి మరణించారు. మరికొందరూ ఈ ఘటనలో గాయపడ్డారు.
రామగుండానికి చెందిన షేక్ షకీల్, అతని భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో ఇద్దరు వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి వారు వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో వారు గోదావరిఖనికి చేరారు. అక్కడ గంగానగర్ ఫ్లైఓవర్ వద్దకు చేరగానే ఓ ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. ఫ్లైఓవర్ యూటర్న్ వద్ద బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ.. మట్టి లోడ్‌తో వస్తున్న మరో లారీ ఢీకొట్టుకున్నాయి. అనంతరం పక్కనే ఉన్న ఆటోపై బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో షేక్ షకీల్, రేష్మ, మరో చిన్నారి మరణించారు. కాగా, ఇదే దుర్ఘటనలో రెండు నెలల చిన్నారి సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: Guntur Accident: మహిళా కూలీల ఆటోను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి, 13మందికి తీవ్ర గాయాలు
స్థానికులు ఈ ప్రమాద విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో శిథిలాల కింద ఇరుక్కున్న చిన్నారిని బయటికి తీశారు. గాయపడ్డవారిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
ఇటీవలే హైదరాబాద్‌లో ఆర్మీ వాహనం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో ఇండియన్ ఆర్మీ (indian army) వాహనం బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లిన ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. ఈ నెల 18వ తేదీ (శనివారం) సాయంత్రం సమయంలో హైదరాబాద్ శివారులో ఈ యాక్సిడెంట్ జరిగింది.
మేడ్చల్ జిల్లా (medchal district) తూంకుంట సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుండి బయటకు వెళుతున్న ఆర్మీ వాహనం అలంకృత రిసార్డ్ వద్దకు రాగానే అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇలా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లింది. దీంతో మూడు కార్లు బాగా ధ్వంసమవగా మరో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.
కృష్ణా జిల్లా నూజివీడు (Nuzvidu)లో రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఇందులో తల్లీ బిడ్డ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, ప్రమాదం నుంచి బయట పడ్డ మరో కూతురు.. తన కళ్ల ముందే మరణించిన తల్లీ, సహోదరినీ చూసి తల్లడిల్లిపోయింది. ఈ ఘటన రోడ్డుపై వెళ్లుతున్న పాదాచారులను కంటతడి పెట్టించింది. స్కూటీపై వెళ్తుండగా ఓ లారీ వీరిని ఢీకొట్టింది.