TRS Protest: చావుడప్పు కొట్టి, పాడెమోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి (Video)

Arun Kumar P   | Asianet News
Published : Dec 20, 2021, 04:59 PM ISTUpdated : Dec 20, 2021, 05:06 PM IST
TRS Protest: చావుడప్పు కొట్టి, పాడెమోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి (Video)

సారాంశం

టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మానుకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిరసన చేపట్టారు. 

కరీంనగర్: తెలంగాణ రైతాంగం నుండి ధాన్యం కొనుగోలు (paddy procurement) చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన చావు డప్పుతో, బిజెపి దిష్టిబొమ్మల దహనాలతో టీఆర్ఎస్ (TRS) నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేసారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. 

ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా (karimnagar district)లోని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లో చేపట్టిన టీఆర్ఎస్ నిరసనలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (rasamai balakishan) పాల్గొన్నారు. చావు డప్పుతో జరిగిన బిజెపి (BJP) శవయాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే రసమయి మండిపడ్డారు. 

Video

 ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నప్పటికి తెలంగాణపై ఆంక్షలు విధించడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. 

Read More  ఆందోళ చేస్తున్న రైతులను కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది: కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హరీష్ రావు

ధాన్యం పండించడంలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలవకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమే ఇందంతా అని రసమయి ఆరోపించారు. బీజేపీ నేతలు అజ్ఞానులుగా మాట్లాడటం రైతుల పట్ల వారికున్న కపట ప్రేమకు నిలువెత్తు నిదర్శనమని ఎమ్మెల్యే రసమయి ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని బిజెపి సర్కార్ కు వ్యతిరేకంగా మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బిజెపి నాయకుల దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలు చేపట్టారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం ధాన్యాన్ని తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

ఇక పెద్దపల్లి జిల్లా (peddapalli district) ధర్మారం మండలం మల్లాపూర్ లోని కరీంనగర్-రాయపట్నం రహదారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి రాస్తారోకో నిర్వహించారు. మొదట చావు డప్పుతో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) శవయాత్ర చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  అనంతరం రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

Read More  TRS Protest: ఈటల ఇలాకాలో టీఆర్ఎస్, బిజెపి శ్రేణుల బాహాబాహీ... జమ్మికుంటలో ఉద్రిక్తత (Video)

అక్కడి నుండి డప్పు చప్పుళ్లతో ర్యాలీగా గ్రామ పంచాయతీ వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని తీసుకోవాలని, అన్ని పంటలకు ఎంఎస్పీచట్టాన్ని అమలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే రైతుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేసారు. 

''తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అధోగతి పాలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో కావాలనే బిజెపి కక్ష గట్టి ధాన్యాన్ని కొనడం లేదు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుతో సంతకాల సేకరణ కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి రైతులకు చేస్తున్న మోసం అందరికి తెలియలనేదే కేసీఆర్ ఉద్దేశ్యం. రైతులు కూడా కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలి'' అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!