Hanamkonda quarry accident: హనుమకొండలో క్వారీలో టిప్పర్‌ లారీ బోల్తా.. ముగ్గురు మృతి

Published : Dec 18, 2021, 03:28 PM IST
Hanamkonda quarry accident: హనుమకొండలో క్వారీలో టిప్పర్‌ లారీ బోల్తా.. ముగ్గురు మృతి

సారాంశం

తెలంగాణలోని హనుమకొండలో (Hanamkonda) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖాజీపేట మండలం (Kazipet Mandal) తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో  టిప్పర్ లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 

తెలంగాణలోని హనుమకొండలో (Hanamkonda) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో టిప్పర్ లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని ఖాజీపేట మండలం (Kazipet Mandal) తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన తోకల ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన ఎండీ అఖీమ్‌గా గుర్తించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు (Madikonda police).. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

Also read: Hyderabd road accident : డివైడర్ ఢీకొన్న కారు, డ్రైవర్ సహా ఇద్దరు లేడీ జూనియర్ ఆర్టిస్టుల మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్ర‌మాదానికి గురైన వాహనం నంబ‌ర్ AP 12 C 5580గా గుర్తించారు. గాయపడ్డవారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. మృతుల వ‌ద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వివ‌రాల‌ను పోలీసులు సేక‌రిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్