కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

Siva Kodati |  
Published : Dec 18, 2021, 02:30 PM ISTUpdated : Dec 18, 2021, 02:32 PM IST
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

సారాంశం

కామారెడ్డి (kamareddy district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 

కామారెడ్డి (kamareddy district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బిచ్చుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే