ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధుల ఏకగ్రీవ ఎన్నిక

By narsimha lode  |  First Published Mar 16, 2023, 4:44 PM IST

ఎమ్మెల్యే  కోటా  కింద ముగ్గురు ఎమ్మెల్సీలు   ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  


హైదరాబాద్: ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. గురువారంనాడు రొటర్నింగ్ అధికారి  నుండి అభ్యర్ధులు  ధృవీకరణ  పత్రాలు  అందుకున్నారు.  దేశపతి శ్రీనివాస్ , నవీన్ కుమార్,  చల్లా వెంకట్రాంరెడ్డిలు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు.  ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధులు  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలకు సంబంధించి ఈ నెల  9వ తేదీన  నామినేషన్లు దాఖలు  చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారికి  నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల్లో   బీఆర్ఎస్ అభ్యర్ధులు మినహా  ఇతర పార్టీల  అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు  చేయలేదు.  దీంతో  ఈ ముగ్గురు ఏకగ్రీవంగా  ఎన్నికైనట్టుగా అధికారులు  ప్రకటించారు.  ఇవాళ  ఎన్నికల రిటర్నింగ్  అధికారి  నుండి  ముగ్గురు  అభ్యర్ధులు  ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాలను  అందుకున్నారు. 

మరో వైపు  గవర్నర్ కోటా  ఎమ్మెల్సీకి  సంందించి  రెండు పదవులకు  రాష్ట్ర ప్రభుత్వం  ఇద్దరి  పేర్లను  గవర్నర్ కు సిఫారసు  చేయనుంది. ఇటీవల జరిగిన  కేబినెట్ సమావేశంలో  ఈ విషయమై  కేబినెట్  చర్చించింది.     నవీన్ కుమార్  ప్రస్తుతం ఎమ్మెల్సీగా  ఉన్నారు. ఆయనకు  ఎమ్మెల్సీగా  కేసీఆర్  మరోసారి  అవకాశం కల్పించారు.  కొత్తగా  దేశపతి శ్రీనివాస్ కు  కేసీఆర్  అవకాశం  ఇచ్చారు.  ఆలంపూర్ నియోజకవర్గంతో పాటు రాయలసీమలో  ప్రభావం  చూపే అవకాశం ఉన్నందున  చల్లా వెంకట్రాంరెడ్డికి  ఎమ్మెల్సీ గా  అవకాశం కల్పించారు. 

Latest Videos

ఏపీ రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని  కేసీఆర్ భావిస్తున్నందున  వెంకట్రాంరెడ్డికి  ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందున  రాజకీయంగా  పార్టీకి  కలిసి వచ్చే అవకాశం ఉందని  ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.

click me!