పేపర్ లీక్‌ బీజేపీ కుట్రే.. ఎవ్వరినీ వదలం : తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 16, 2023, 04:14 PM IST
పేపర్ లీక్‌ బీజేపీ కుట్రే.. ఎవ్వరినీ వదలం : తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇందులో రాజకీయ కోణాలు వున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఏ2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్తేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ బీజేపీ కుట్రేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏ2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్తేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బండి సంజయ్‌వి దుర్మార్గపు ఆలోచనలని మంత్రి ఎద్దేవా చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 

కాగా.. పేపర్ లీకేజ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇందులో రాజకీయ కోణాలు వున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని ఫోటోలు విడుదల చేశారు మంత్రి కేటీఆర్. స్కాం వెనుక వున్న సూత్రధారులను కనిపెట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కేటీఆర్ డీజీపీని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేసినట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమాయకుల జీవితాలను నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. 

ALso REad: పేపర్ లీకేజ్ బీజేపీ కుట్రే, నిందితుడు రాజశేఖర్ ఆ పార్టీ కార్యకర్తే.. ఫోటోలు విడుదల చేసిన కేటీఆర్

మరోవైపు.. పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 పోస్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. మార్చి 5న దాదాపు 55 వేల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 

ఇకపోతే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్నారు రేణుక. ఏడాది 12 సెలవులు పెట్టింది రేణుక. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని సెలవు పెట్టింది. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు పెడుతోంది రేణుక. 

పేపర్ లీక్‌కు సూత్రధారిగా రాజశేఖర్‌ను తేల్చారు పోలీసులు. ప్రవీణ్ ద్వారా పేపర్‌ను బయటికి తెప్పించాడు రాజశేఖర్. టీఎస్‌పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్‌ వ్యవహరిస్తున్నాడు. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు రాజశేఖర్. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పాడు ప్రవీణ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District