టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు కేసీఆర్ బాధ్యత వహించాలి.. రాజకీయం చేసి పక్కపార్టీపైకి నెట్టొద్దు: ఈటల ఫైర్

Published : Mar 16, 2023, 04:24 PM IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు కేసీఆర్ బాధ్యత వహించాలి.. రాజకీయం చేసి పక్కపార్టీపైకి నెట్టొద్దు: ఈటల ఫైర్

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసే అలవాటున్న కేసీఆర్, అండ్ కో.. దీన్ని కూడా రాజకీయం చేసి తప్పించుకోవాలని ప్రయత్నించవద్దని అన్నారు. రాజకీయం చేసి పక్కపార్టీపై నెట్టొద్దని చెప్పారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రతీది రాజకీయం చేయడం అలవాటైపోయిందని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌నూ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇలా రాజకీయం చేసి తమ అసమర్థ పాలన, అవినీతి పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఇది సరికాదని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీన్ని రాజకీయం చేసి పక్క పార్టీపై నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయించి కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి దోషులు తప్పించుకోకుండా చూడాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. కానీ, కేసీఆర్ పాలన.. మ్యాక్సిమమ్ పాలిటిక్స్, మినిమమ్ రూలింగ్ అన్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. చేసిన కొన్నింటిలో అక్రమాలు చేసి యువత భవితను కేసీఆర్ సర్కారు అంధకారంలో ముంచుతున్నదని ఈటల విమర్శలు చేశారు.

రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ కేవలం నోటిఫికేషన్‌లతోనే సరిపెడుతున్నాడని ఆరోపించారు. 

పేపర్ లీక్ అవ్వగానే సింపుల్‌గా పరీక్ష రద్దు చేస్తామని ప్రకటిస్తున్నారని, కానీ, ఈ నిర్ణయం వెనుక ఎంతమంది అభ్యర్థుల ఆర్తనాధాలు ఉన్నాయో కేసీఆర్ అర్థం చేసుకోగలడా? అని ఈటల మండిపడ్డారు.

Also Read: హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం... వడగండ్ల వాన బీభత్సం (videos)

పరీక్షాపత్రాలు లీక్ కాకుండా, అవినీతి జరగకుండా నిఘా పెట్టాలని, అలా కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

ప్రతి అంశానికి రాజకీయ రంగు పులిమి బయటపడే అలవాటున్న కేసీఆర్ అండ్ కో.. పేపర్ లీక్ అంశాన్ని కూడా పక్కపార్టీ వాళ్ల మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇంత సమయాన్ని వృథా చేసుకున్న నిరుద్యోగులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?