అమీన్‌పూర్ కేసు: కేర్ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దు.. పోలీసుల అదుపులో నిందితులు

By Siva KodatiFirst Published Aug 13, 2020, 8:20 PM IST
Highlights

అమీన్‌పూర్‌లోని మారుతి చైల్డ్ కేర్ సెంటర్‌ రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసింది స్త్రీ శిశు సంక్షేమశాఖ. చైల్డ్ కేర్ సెంటర్ కార్యాకలాపాలపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది

అమీన్‌పూర్‌లోని మారుతి చైల్డ్ కేర్ సెంటర్‌ రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసింది స్త్రీ శిశు సంక్షేమశాఖ. చైల్డ్ కేర్ సెంటర్ కార్యాకలాపాలపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది.

బాలికపై అత్యాచారం కేసులో విచారణాధికారిగా ఏసీపీ స్థాయి అధికారిని నియమించాలని డీజీపీకి మహిళా శిశు సంక్షేమ శాఖ సూచించింది. మిగిలిన పిల్లల్నిఅక్కడి నుంచి తరలించాలని ఆదేశించింది.

బాలిక ఫిర్యాదుతో ఆమె బావ అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారంల ప్రాథమిక నివేదిక వస్తుందన్న మహిళా, శిశు సంక్షేమ శాఖ ... బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించింది.

Also Read:అమీన్‌పూర్ మైనర్ బాలిక మృతి కేసులో ట్విస్ట్: బాలిక బంధువులపై కేసు, సమగ్ర విచారణకు ఆదేశం

మరోవైపు బాలిక అత్యాచారం కేసులో అమీన్  పూర్ పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు సంగారెడ్డి ఎస్పీ. ఈ కేసుకు సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఈ నెల 1న బోయిన్‌పల్లి నుంచి జీరో ఎఫ్ఐఆర్‌తో కేసు ఇక్కడికి బదిలీ అయ్యిందని వివరించారు.

వేణుగోపాల్ రెడ్డి, విజయ, ఆమె సోదరుడు ముగ్గురు తమ కస్టడీలోనే ఉన్నారని.. అనాథాశ్రమంలోని తోటి చిన్నారుల నుంచి వివరాలు తెలుసుకుంటామని ఎస్పీ స్పష్టం  చేశారు.

Also Read:మత్తు పానీయం ఇచ్చి అనాథాశ్రమంలో దాత రేప్: బాలిక మృతి

కాగా అనాథాశ్రమంలో ఉన్న ఓ 14 ఏళ్ల బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తరచుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వేసవి సెలవులు, లాక్‌డౌన్ కారణంగా బోయిన్‌పల్లిలోని తన చిన్నమ్మ ఇంటికి వచ్చింది.

అయితే బాలిక అనారోగ్యానికి గురికావడంతో బంధువులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ల పరీక్షలో ఆమె లైంగిక దాడికి గురైనట్లు తేలడంతో అవాక్కయ్యారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ నీలోఫర్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.

click me!