ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ.1,000 కోట్ల మోసం: ఇండియాలో చైనా కంపెనీ దందా

Siva Kodati |  
Published : Aug 13, 2020, 05:31 PM IST
ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ.1,000 కోట్ల మోసం: ఇండియాలో చైనా కంపెనీ దందా

సారాంశం

అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు

అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఓక్కో పేరుతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ కంపెనీ.. దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించింది ఈ చైనా కంపెనీ. ఈ కేసుకు సంబంధించి ఓ చైనా జాతీయుడితో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఈ కంపెనీ.. పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించింది. టెలిగ్రాం యాప్ ద్వారా అడ్మిన్ సాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇప్పటికే ఈ ముఠా ఆగడాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారు. పలు బ్యాంక్ ఖాతాల్లోని రూ.30 కోట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.

ఈ కేసులో దర్యాప్తు సాగుతోందన్న ఆయన ఇందులో ఎంతోమంది మోసపోయి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై కన్నేసి ఉంచాలని అంజనీ కుమార్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ