ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు: సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

Published : Aug 13, 2020, 04:15 PM IST
ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు: సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

సారాంశం

ప్రైవేట్ ఆసుపత్రులపై అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది.  జీవోలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రులపై అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. 
జీవోలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారంనాడు విచారించింది. ఈ విచారణకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఈ విచారణకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు.ప్రభుత్వం నిర్ధేశించిన జీవోలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 

ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం చేశాయో లేదా పరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. పేదలకు ఉచిత వైద్యం అందించకపోతే లోపం ఎక్కడో పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 

ఢిల్లీ తరహాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు పడకలు కేటాయించాలని సలహా ఇచ్చింది. ప్రభుత్వానికి వీలు కాకపోతే కారణాలు తెలపాలని కూడ కోరింది. 
సీఎస్ నేతృత్వంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని కూడ సూచించింది. 

కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం, వైద్య సిబ్బంది చర్యలను హైకోర్టు అభినందించింది. భవిష్యత్తులో కూడ ఇదే తరహాలో వైద్య సేవలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

తదుపరి విచారణకు సీఎస్ హాజరు కానవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు డీఎంఈ, ప్రజారోగ్య డైరెక్టర్ హాజరు కావాలని హైకోర్టు కోరింది. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu