ఫ్రెండ్లీ పోలీసులే జాతీయ జెండాను అవమానించారు

Published : Jun 21, 2017, 11:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఫ్రెండ్లీ పోలీసులే జాతీయ జెండాను అవమానించారు

సారాంశం

పాలకులు పొగడ్తలతో ముంచెత్తడంతో హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసులు తమ విధులు మరచిపోతున్నారు. చేయాల్సిన పనులు గాలికొదిలి ఇతర పనుల్లో బిజీ అయిపోయారు. తుదకు జాతీయ జెండాను అవమానించేవరకు చేరారు.

 

జాతీయ జెండాను రక్షించాల్సిన వారే  నిర్లక్ష్యం చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారే తీవ్ర అవమానం చేశారు. ఇదీ హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసుల నిర్వాకం. నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న టప్పాచబుత్రా పోలీసు స్టేషన్ మీద జాతీయ పతాకం చినిపోయింది.

 

అయినా పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చినిగిపోయిన జెండాను అలాగే వదిలేయడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆ పోలీసుల నిర్వాకంపై ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

అయ్యా ఫ్రెండ్లీ పోలీసులూ జర ఆ జాతీయ జెండాను గౌరవించండి సారూ అంటూ పలువురు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?