
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఉరుములు పిడుగులతో వర్షం కురిసింది. ఇదే సమయంలో కాళేశ్వరం దేవాలయంలో పిడుగు పడింది. దేవాలయంలోని రాజగోపురం సమీపంలోనే పిడుగు పడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పిడుగు పడిన ప్రాంతంలో కొంత భాగం దెబ్బతింది. పిడుగుపాటుతో ఆలయంలో కరెంట్ మీటర్ పాక్షికంగా ధ్వంసం అయింది. ఆలయంలో ఉన్న భక్తులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కాళేశ్వరంలో ఆలయం ఆవరణలో పిడుగుపడడంపై అర్చకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని అర్చకులు తెలిపారు. కానీ కాళేశ్వరంలో పిడుగు పడిన సంఘటనపై వారు స్పస్టమైన వివరణ ఇవ్వలేదు.
ఆలయ ఆవరణ గోడ కొంత పాక్షికంగా ధ్వంసం అయింది. గోడ రాళ్లు కింద పడిపోయాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అర్చకులు చెబుతున్నారు. ఈ సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.