అసెంబ్లీలో కోమటిరెడ్డి హెడ్ ఫోన్ తో ఎట్ల కొట్టిండంటే (వీడియో)

Published : Mar 12, 2018, 03:48 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అసెంబ్లీలో కోమటిరెడ్డి హెడ్ ఫోన్ తో ఎట్ల కొట్టిండంటే (వీడియో)

సారాంశం

గవర్నర్ పై గురిపెట్టి హెడ్ పోన్ విసిరిన కోమటిరెడ్డి వీడియో విడుదల చేసిన సర్కారు కోమటిరెడ్డి పై వేటుకు రంగం సిద్ధమైనట్లేనని ప్రచారం

తెలంగాణ అసెంబ్లీలో తొలిరోజు హాట్ టాపిక్ గా మారిన కోమటిరెడ్డిపై వేటుకు తెలంగాణ సర్కారు రంగం సద్ధం చేస్తోంది. కోమటిరెడ్డి హెడ్ ఫోన్ తో గవర్నర్ కు సూటి చూసి కొట్టిన వీడియోను తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో కోమటిరెడ్డి పైకి ఎక్కి సూటిగా గవర్నర్ కు తగిలేలా హెడ్ ఫోన్ తో కొట్టారు. అయితే అది గవర్నర్ కు తాకకుండా శాసనమండలి ఛైర్మన్ కు తగిలింది. దాంతో ఆయన కన్ను భాగంలో గాయమైంది. వెంటనే ఆయనకు అసెంబ్లీ డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స చేసి సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స నడుస్తోంది. అయితే కోమటిరెడ్డి పై ఏరకమైన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి ఎలా గురి చూసి కొడుతున్నారో కింద వీడియో ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం