హరీష్ పాత వీడియోను బయటకు తీసిన కాంగ్రెస్ (వీడియో)

Published : Mar 12, 2018, 02:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
హరీష్ పాత వీడియోను బయటకు తీసిన కాంగ్రెస్ (వీడియో)

సారాంశం

ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పై హరీష్ దాడి వీడియో వెలుగులోకి హరీష్ వీడియోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు కోమటిరెడ్డిపై వేటు పడకుండా సర్కారుపై కాంగ్రెస్ ఎత్తుగడ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే సెగలు రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ ఫోన్ విసరడం.. మండలి ఛైర్మన్ కు తాకడంతో వివాదం సీరియస్ అయింది. ఈ ఘటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది సర్కారు. అయితే తనమీద వేటు వేస్తానంటే భయపడే సవాలే లేదని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో హరీష్ రావు ఇదే గవర్నర్ ను కొట్టడానికి పోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఒకసారి పరిశీలించాలని కోమటిరెడ్డి అంటున్నారు.

ఈ నేపథ్యంలో హరీష్ రావు ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ మీదకు దాడి చేసేందుకు టేబుళ్ల మీదనుంచి ఉరికిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీ బయటకు తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోంది. అప్పట్లో హరీష్ రావు ఎంత దూకుడు ప్రదర్శించారన్న విషయాన్ని జనాలకు చెప్పేందుకే ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

మరోవైపు కోమటిరెడ్డి దాడి తాలూకు అన్ని వీడియోలు చూసిన తర్వాత దాడి తీవ్రతనుబట్టి చర్యలు తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

కాంగ్రెస్ వైరల్ చేస్తున్న వీడియో కింద ఉంది. మీరూ ఒక లుక్కేయండి.

PREV
click me!

Recommended Stories

Union Minister Rammohan Naidu Inaugurates ‘Wings India 2026’ in Hyderabad | Asianet News Telugu
Civil Aviation Minister Rammohan Naidu Speech at Wings India 2026 Hyderabad | Asianet News Telugu