పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్ లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు.
తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi scamకి చెందిన రూ.65.05 కోట్ల FDలను కొల్లగొట్టిన సాయికుమార్ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు.
పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్ లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు. సాయికుమార్, డాక్టర్ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు.
Telugu Academy Fixed Depositsను సొంతానికి వినియోగించుకుంటన్న సమయంలోనే.. సాయికుమార్ ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ, ఆయిల్ సీడ్స్ సంస్థలపై కన్నేశాడు. ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు.
బ్యాంక్ అధికారులతో మాట్లాడుకుని అంతా సిద్ధం చేసుకున్నాక కృష్ణారెడ్డిని పలుమార్లు విజయవాడకు పంపించాడు. అక్కడ బ్యాంక్ ఖాతాలను తెరిపించడం, బ్యాంక్ అధికారులతో మాట్లాడ్డం.. ఫిక్స్ డ్ డిపాజిట్లను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక కృష్ణారెడ్డి ఎవరి మాటలు వారికి పంపించడంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు.
కాగా, రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులో కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 16కి చేరుకుంది. బ్యాంక్ నుంచి డబ్బులు కొల్లగొట్టాలని కృష్ణారెడ్డి ప్లాన్ గీశాడు. సాయికుమార్‌కు సలహా ఇచ్చి రూ.2.50 కోట్లను కమీషన్‌గా తీసుకున్నాడు కృష్ణారెడ్డి. దీంతో వీరిద్దరూ కలిసి ప్రభుత్వ శాఖల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాజేసేందుకు కుట్రపన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణారెడ్డి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్లకేలకు సోమవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. ఈ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అక్టోబర్ 14న అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు అనే వ్యక్తిని గుంటూరులో పట్టుకున్నారు. బ్యాంక్ మేనేజర్లకు సాయికుమార్‌ను పరిచయం చేసింది ఈ సాంబశివరావేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. మేనేజర్లను పరిచయం చేసినందుకు గాను కమీషన్ వసూలు చేశాడు. ఈ క్రమంలోనే మస్తాన్‌వలీ, సాధనను పరిచయం చేసినందుకు గాను రూ.60 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే సాయికుమార్, బ్యాంక్ మేనేజర్లు వైజాగ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్నారు. తాజాగా సాంబశివరావును గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు సీసీఎస్ పోలీసులు.
ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ప్రభుత్వానికి గల్లంతైన సొమ్ము వెనక్కిచ్చిన ఐవోబీ.. ఎంతంటే..?
మరోవైపు తెలుగు అకాడమీ స్కాంలో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ ఏపీలోని రెండు ప్రభుత్వ సంస్థల నుంచి కూడా sai kumar gang డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ap warehousing corporation నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్. ఆలాగే ఏపీ సీడ్స్ కార్పోరేషన్ నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను కూడా డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.
ఇకపోతే .. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను అక్టోబర్ 15న ప్రభుత్వానికి వెనక్కిచ్చింది indian overseas bank. ఈ బ్యాంక్ బ్రాంచ్‌లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్‌డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. దీనిపై ఐవోబీ యాజమాన్యం స్పందించింది. దీంతో గిడ్డంకుల శాఖ అకౌంట్‌లో రూ.9.6 కోట్లను బ్యాంక్ డిపాజిట్ చేసింది. వడ్డీ డబ్బులు కూడా ఎఫ్‌డీల మెచ్యూర్ అయ్యేనాటికి ఇస్తామని ఐవోబీ తెలిపింది. బ్యాంక్ సిబ్బంది సహకారంతో స్కామ్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనిపై గిడ్డంకుల శాఖ ఎండీ స్పందించారు. అమౌంట్ అంతా వెనక్కి వచ్చిందని ఆయన తెలిపారు.