తెలంగాణ పరిషత్ ఎన్నికలు: కొనసాగుతున్న చివరి విడత పోలింగ్

Siva Kodati |  
Published : May 14, 2019, 09:10 AM IST
తెలంగాణ పరిషత్ ఎన్నికలు: కొనసాగుతున్న చివరి విడత పోలింగ్

సారాంశం

తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 9,494 కేంద్రాల్లో మంగళవారం పోలింగ్ జరుగుతోంది.

తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 9,494 కేంద్రాల్లో మంగళవారం పోలింగ్ జరుగుతోంది. చివరి విడతలో 1,738 ఎంపీటీసీలు, 161 జడ్పీటీసీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 30 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.

5,726 మంది ఎంపీటీసీ స్ధానాలకు, 741 మంది జడ్పీటీసీ స్థానాలకు పోటీ పడుతున్నారు. తొలి దశలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?