రెడ్ హ్యండెడ్‌గా ఏసిబికి చిక్కిన దేవాదాయ శాఖ అధికారిణి...

Published : May 13, 2019, 09:35 PM IST
రెడ్ హ్యండెడ్‌గా ఏసిబికి చిక్కిన దేవాదాయ శాఖ అధికారిణి...

సారాంశం

వేములవాడ దేవస్థానంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి బయటపడింది. ఆలయానికి చెందిన ఓ మహిళా అధికారిణి భారీగా లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు.

వేములవాడ దేవస్థానంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి బయటపడింది. ఆలయానికి చెందిన ఓ మహిళా అధికారిణి భారీగా లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు.

వేములవాడ మండల పరిధిలో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ కొత్తగా వెంచర్ ఏర్పాటు చేస్తోంది. అయితే ఇందుకోసం వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ చీఫ్ ప్లానింగ్ అధికారిణి నుండి అనుమతి పొందాల్సి వుంది. అయితే ఈ అనుమతి కోసం సదరు అధికారిణి రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.6 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

దీంతో రియల్ ఎస్టేట్ సంస్థ ఏసిబిని ఆశ్రయించారు. ఆ అధికారిణిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకోడానికి ఏసిబి పథక రచన చేసింది. ఆమె సూచించినట్లే  కోఠిలోని గుజరాత్ గల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నుండి అధికారిణి డబ్బులు స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?