యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు పై అజారుద్దీన్ వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published May 13, 2019, 8:19 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అసరం అయితే దాన్ని హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అసరం అయితే దాన్ని హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్ ప్రధాని నరేంద్రమోదీ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ది చెప్పడం కంటే, కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌ గాంధీ ఫ్యామిలీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీల గురించి మోదీ ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. మరోవైపు అంబర్‌పేట్‌లో జరిగిన ఘర్షణలపై తీవ్రంగా స్పందించారు. మజీద్‌ స్థలం పురాతనమైనదన్న ఆయన జీహెచ్‌ఎంసీ అక్రమంగా కూల్చివేసిందంటూ మండిపడ్డారు. 

పురాతన మజీద్‌కు కనీసం గౌరవం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజీద్ కూల్చివేతకు సంబంధించిన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఎవరికి చెల్లించారని నిలదీశారు. ఏ ప్రాతిపదికగా చెల్లించారని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మజీద్ కు ఇతరులకు ఎలా పరిహారం చెల్లిస్తారో చెప్పాలని అజారుద్దీన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.   

click me!