అత్తాపూర్ మర్డర్: విక్రం సింగ్ అరెస్ట్

Published : Oct 02, 2018, 11:17 AM IST
అత్తాపూర్ మర్డర్: విక్రం సింగ్ అరెస్ట్

సారాంశం

గత నెల 26వ తేదీన అత్తాపూర్ వద్ద  రమేష్ అనే యువకుడిని  హత్య చేసిన ఘటనలో  విక్రమ్ సింగ్ అనే నిందితుడిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  


హైదరాబాద్: గత నెల 26వ తేదీన అత్తాపూర్ వద్ద  రమేష్ అనే యువకుడిని  హత్య చేసిన ఘటనలో  విక్రమ్ సింగ్ అనే నిందితుడిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  విక్రమ్ సింగ్‌తో ‌అరెస్ట్‌తో ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

2017 డిసెంబర్ 24వ తేదీన మహేష్‌గౌడ్ అనే యువకుడిని  రమేష్‌తో పాటు అతని స్నేహితులు  అతి దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధం విషయమై మహేష్‌గౌడ్‌ను హత్య చేశారు. 

మహేష్‌గౌడ్ హత్యకు ప్రతీకారంగానే ఆయన తండ్రి కిషన్‌గౌడ్  2018 సెప్టెంబర్ 26వ తేదీన రమేష్‌ను అత్తాపూర్ పిల్లర్ 143 వద్ద రోడ్డుపై అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో ఇప్పటికే  కిషన్‌గౌడ్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  తాజాగా వీరికి సహకరించిన విక్రంసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అత్తాపూర్ మర్డర్: రమేష్ హత్యకు ముందు కిషన్‌ ఏం చేశాడంటే?

అత్తాపూర్ మర్డర్‌లో ట్విస్ట్: సంచలన విషయాన్ని బయటపెట్టిన సోదరుడు

అత్తాపూర్ మర్డర్: రమేష్‌ను కాపాడేందుకు ముగ్గురి సాహసం

అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...


 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu