అప్పుడే పుట్టిన బిడ్డను కవర్లో చుట్టి.. బాత్‌రూమ్‌లో పడేసిన తల్లి.. బిడ్డ మృతి

sivanagaprasad kodati |  
Published : Oct 02, 2018, 10:18 AM IST
అప్పుడే పుట్టిన బిడ్డను కవర్లో చుట్టి.. బాత్‌రూమ్‌లో పడేసిన తల్లి.. బిడ్డ మృతి

సారాంశం

మంచిర్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను పాలిథీన్ కవర్లో చుట్టి బాత్‌రూమ్‌లో పడేసింది కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని వార్డుల్లో బాత్‌రూమ్‌ని శుభ్రం చేస్తున్న అక్కడి సిబ్బందికి పాలిథీన్‌ కవర్‌లో చుట్టిన పసిబిడ్డ కనిపించింది

మంచిర్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను పాలిథీన్ కవర్లో చుట్టి బాత్‌రూమ్‌లో పడేసింది కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని వార్డుల్లో బాత్‌రూమ్‌ని శుభ్రం చేస్తున్న అక్కడి సిబ్బందికి పాలిథీన్‌ కవర్‌లో చుట్టిన పసిబిడ్డ కనిపించింది.

దీంతో సిబ్బంది వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఆ బిడ్డను ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందించినప్పటికీ పసి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లి.. ఆ శిశువుని పాలిథీన్ కవర్‌లో చుట్టి బాత్‌రూమ్‌లో పడేసి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు