హైదరాబాద్: మందుబాబుల వీరంగం.. వాహనాలు ఢీకొడుతూ, ఫోన్లు లాక్కుంటూ ఆటోలో హల్‌చల్

By Siva KodatiFirst Published Dec 11, 2021, 8:50 PM IST
Highlights

హైదరాబాద్‌లో మందు బాబులు వీరంగం సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. గడిచిన కొన్ని రోజుల్లో బంజారాహిల్స్‌, నార్సింగ్‌ ప్రాంతాల్లో నలుగురి ప్రాణాలను మందు బాబులే బలితీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన కలకలం రేపింది

హైదరాబాద్‌లో మందు బాబులు వీరంగం సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. గడిచిన కొన్ని రోజుల్లో బంజారాహిల్స్‌, నార్సింగ్‌ ప్రాంతాల్లో నలుగురి ప్రాణాలను మందు బాబులే బలితీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన కలకలం రేపింది. పట్టపగలే పీకలదాకా మద్యం సేవించిన ఇద్దరు యువకులు ఆటో నడుపుతూ బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో ఆటోతో పలువురిని ఢీకొట్టడంతో పాటు మరికొందరిపై దాడులకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బంజారాహిల్స్‌ వరకు దారి పొడవునా ఈ తాగుబోతులు వీరంగం వేశారు. మార్గమధ్యంలోని వాహనదారుల ఫోన్లు లాక్కుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు వారిని వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆటోతో సహా పోకిరీలను అరెస్ట్ చేశారు.

ఇకపోతే హైదరాబాద్ (hyderabad police) బంజారాహిల్స్‌లో (banjara hills road accident) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన మందుబాబులు రోహిత్ (rohit) , సుమన్‌లు (suman) ఘటన జరగడానికి ముందు మూడు పబ్బుల్లో పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మూడు పబ్బుల్లో సీసీ కెమెరాలు ఫుటేజ్ సేకరించారు పోలీసులు. పబ్ నుండి బయటకి రాగానే బంజారాహిల్స్ హోటల్‌లో ఉండేందుకు రోహిత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రోహిత్‌పై 304 (2) , సుమన్ పై 109 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also Read:బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మ‌రో ట్విస్ట్‌.. మూడు పబ్బుల్లో పార్టీలు చేసుకుని, డ్రైవింగ్

ప్రమాదం తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైయ్యారు రోహిత్, సుమన్. అయితే… ఆ ఇద్దరిని ఛేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ సంద‌ర్భంగా వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మ‌ట్లాడుతూ… బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా ఆధారాలు సేకరించి, ఛార్జ్ షీట్ వేస్తామని వెల్లడించారు. వెస్ట్ జోన్‌లో పబ్ లు, బార్‌లు‌పై కూడా నిఘా ఉంటుందని… మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామ‌ని వెల్ల‌డించారు. ఎక్కువ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యూత్ పట్టుబడుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కేసులో పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామ‌న్నారు.

click me!