Telangana: గర్ల్స్ కాలేజీలో వెరైటీ చోరీ.. ‘సలార్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’

Published : Jan 03, 2024, 10:42 PM IST
Telangana: గర్ల్స్ కాలేజీలో వెరైటీ చోరీ.. ‘సలార్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’

సారాంశం

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీలో వెరైటీ దొంగతనం జరిగింది. కొందరు దొంగలు కాలేజీలోకి చొరబడి ఫ్యాన్‌లలోని కాపర్ వైర్లను దొంగిలించారు. అంతేనా.. బ్లాక్ బోర్డుపై సలార్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి అని ఉచిత సలహా రాసి వచ్చారు.  

నాగర్ కర్నూల్ జిల్లాలో వెరైటీ దొంగతనం జరిగింది. కొందరు చోరులు జిల్లాలోని బాలికల జూనియర్ కాలేజీలోకి చొరబడ్డారు. కాలేజీలోని ప్రాక్టికల్స్ సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లి కాపర్ వైర్లను చోరీ చేశారు. సీలింగ్ ఫ్యాన్‌లను ఊడదీసి ఆ కాపర్ వైర్లను దొంగతనం చేశారు. ఆ తర్వాత ఫ్యాన్లను తగులబెట్టారు. వారు అంతటితో ఆగలేదు. ఓ ఉచిత సలహా ఇచ్చారు. 

ఆ గదిలోని బ్లాక్ బోర్డుపై చాక్ పీస్‌తో తాము ఎందుకు దొంగతనం చేశామో రాశారు. తమ అవసరాల కోసమే తాము కాలేజీలోని ఎలక్ట్రిక్ వైర్లను దొంగిలించామని పేర్కొన్నారు. మిగిలిన భాగాలను అలాగే వదిలిపెడుతున్నామని, తమను మన్నించగలరని మనవి అంటూ బ్లాక్ బోర్డుపై రాశారు. అంతేకాదు, సలార్ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు.

Also Read : జగన్‌కు చంద్రబాబు కౌంటర్.. ‘ ఆయన వదిలిన బాణం ఇప్పడు రివర్స్‌లో తిరుగుతున్నది ’

జనవరి 1వ తేదీన సిబ్బంది ఆ డోర్ ఓపెన్ చేయడానికి వచ్చి ఖంగుతిన్నారు. తలుపు గొళ్లెం ధ్వంసమై ఉన్నది. డోర్ తెరిచి చూడగా.. గది అంతా చిందరవందరగా ఉన్నది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంలోని ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద సెక్యూరిటీ తక్కువ ఉన్నదని గమనించి వారు ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమా నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం