కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్సేనని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బ
బుధవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. అనంతం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నేటి నెల రోజులు అయ్యిందన్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని , కేసీఆర్ సీఎంగా దిగిపోతారని అనుకోలేదని గ్రామాల్లో తమ నేతలతో జనం అంటున్నారని కేటీఆర్ చెప్పారు. మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ.. కేసీఆర్ సీఎంగా వుండడు అని తాము కలలో కూడా ఊహించలేదని అంటున్నారని తారక రామారావు పేర్కొన్నారు. కొన్ని కార్యక్రమాలు, పెట్టిన పథకాల్లో కొన్ని సవరణలు చేస్తే బాగుండేదని అంటున్నారని ఆయన తెలిపారు.
నేటి సమావేశానికి వచ్చినవాళ్లు.. పార్టీ ఆవిర్భావం నుంచి వున్నవాళ్లని వారు చెప్పిన మాటను ప్రజల అభిప్రాయంగా పరిగణిస్తామని కేటీఆర్ అన్నారు. గడిచిన పదేళ్లలో అభివృద్ధి విషయంగా ఎలాంటి ఫిర్యాదులు లేవని, 1.88 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మాపై జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి వుంటే బాగుండేదని కేటీఆర్ తెలిపారు. భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన విషయాన్ని ప్రచారం చేసుకోలేకపోయామని ఆయన పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆలోచన వున్నప్పటికీ .. మా ప్రధాన ఎజెండా తెలంగాణనే అన్నారు. తెలంగాణ హక్కులు, వాటాల కోసం పోరాడగలిగేది తామేనని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్సేనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి గుర్తింపును తెచ్చే లీడర్ వుంటారని.. ఏపీలో జగన్, చంద్రబాబు మాదిరిగా తెలంగాణ అంటే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్సేనని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని .. ఆయన ప్రయత్నాల వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని తారక రామారావు గుర్తుచేశారు.