రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. బుధవారం 23 మంది ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. బుధవారం 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో సీఎంవోలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ్టీతో దానికి తెరపడింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌ను నియమించింది. అయితే గంటల వ్యవధిలోనే 23 మంది ఐపీఎస్‌లను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.