Huzurabad Bypoll: సొంత ఓటు పడని అభ్యర్థులు.. వీరే..!

By telugu teamFirst Published Oct 19, 2021, 5:57 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక మరో ట్విస్ట్‌కు వేదికైంది. ఈ ఎన్నికలో ప్రధానపార్టీలు సహా ఇండిపెండెంట్లూ చాలా మందే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో చాలా మంది అభ్యర్థులు స్థానికేతరులే ఉన్నారు. దీంతో వారు తమ ఓటును తమకే వేసుకోలేని పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. కేవలం ఇండిపెండెంట్లే కాదు.. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌దీ ఇదే పరిస్థితి.
 

హుజురాబాద్ ఉపఎన్నిక వైపే రాష్ట్రమంతా చూస్తున్నది. ఈ ఎన్నిక కోసం అధికారపార్టీ TRS, BJPల మధ్య రసవత్తర క్యాంపెయిన్ సాగతున్నది. ఈ ఎన్నిక ఎన్నో ట్విస్టులకు వేదికవుతున్నది. ఉప ఎన్నిక రావడమే దానికదిగా ఒక ట్విస్టు అయితే, అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల పర్వం వరకూ ఒక్కో మలుపు వెలుగుచూస్తున్నది. నామినేషన్ల పర్వంలో అనూహ్యంగా ఇండిపెండెట్ అభ్యర్థులు తెరమీదకు రావడమూ చర్చనీయాంశంగానే మారింది. మొత్తంగా ఈ ఉపఎన్నిక బరిలో దిగిన Candidateలలో స్థానికేతరులే ఎక్కువగా ఉండటం మరో ఆసక్తికర అంశంగా ఉన్నది. చాలా మంది అభ్యర్థులు Huzurabad నియోజకవర్గానికి చెందినవారు కాకపోవడంతో వారి Vote వారికి వేసుకునే పరిస్థితి లేకపోయింది.

Bypoll కోసం క్యాంపెయిన్‌లో ఎవరిదారి వారిది. తమ ఎజెండాను ముందుంచి తమకే ఓటు వేయాలని అభ్యర్థులందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ స్థానికేతర అభ్యర్థులు మాత్రం వారి సొంత ఓటు వారికి వేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కేవలం ఇండిపెండెంట్లకే కాదు.. జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌‌ కూడా ఈ అవాంతరాన్నే ఎదుర్కోబోతున్నారు.

Also Read: Huzurabad Bypoll: ఈటలతో కలిసి కాంగ్రెస్ లోకి జంప్... కేటీఆర్ వ్యాఖ్యలపై వివేక్ క్లారిటీ

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి కరీంనగర్‌కు చెందినవారు. ఆయన ఓటు హుజురాబాద్ నియోజకవర్గంలో లేదు. హైదరాబాదులో ఉన్నది. దీంతో హుజురాబాద్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేరు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూర్ మహమ్మద్ నిజామాబాద్‌కు చెందినవారు. జైస్వరాజ్ పార్టీకి చెందిన కన్నం సురేశ్‌ మేడ్చల్ జిల్లావాసి. ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు సూర్యపేట జిల్లాకు చెందినవారు. దీంతో వీరెవరూ తన ఓటును తనకే వేసుకోలేకపోతున్నారు.

కాగా, స్వతంత్రంగా బరిలోకి దిగిన ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం కోట శ్యామ్ కుమార్‌లు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందినవారు. ఎడ్ల జోజిరెరడ్డి తిమ్మాపూర్ మండలానికి చెందినవారు. కుమ్మరి ప్రవీణ్ కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామవాసి. గుగులోతు తిరుపతి సైదాపూర్, గంజీ యుగంధర్ పర్వతగిరి నివాసి. వీరందరూ తమ స్వగ్రామంలో ఓటు హక్కును కలిగి ఉన్నారు. హుజురాబాద్ బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులలో 20 మంది అంటే మూడింట రెండు వంతల మంది అభ్యర్థులు తమ ఓటును తమకే వేసుకోలేరు.

click me!