పెళ్లి చేసుకొన్నాకే మాకు చెప్పారు: హేమంత్ తల్లి రాణి

Published : Sep 25, 2020, 12:27 PM IST
పెళ్లి చేసుకొన్నాకే మాకు చెప్పారు: హేమంత్ తల్లి రాణి

సారాంశం

పెళ్లి చేసుకొన్న విషయం కూడ తమకు తెలియదని.. పెళ్లి చేసుకొన్నానే హేమంత్, అవంతి ఈ విషయాన్ని తమకు చెప్పారని హేమంత్ తల్లి రాణి చెప్పారు.


హైదరాబాద్: పెళ్లి చేసుకొన్న విషయం కూడ తమకు తెలియదని.. పెళ్లి చేసుకొన్నానే హేమంత్, అవంతి ఈ విషయాన్ని తమకు చెప్పారని హేమంత్ తల్లి రాణి చెప్పారు.

సంగారెడ్డి సమీపంలో హేమంత్ ను అవంతి కుటుంబసభ్యులు వచ్చినట్టుగా సమాచారం రావడంతో తాము బైక్ పై అక్కడికి వెళ్లే సరికి తన కొడుకు , కోడలును కిడ్నాప్ చేశారని రాణి తెలిపారు.

ఎనిమిదేళ్లు హేమంత్, అవంతి ప్రేమించుకొన్నారని రాణి చెప్పారు. ఇంట్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని తాను వారిద్దరికి చెప్పినట్టుగా రాణి గుర్తు చేసుకొన్నారు. అవంతిని ఇంట్లో బంధిస్తే ఆ అమ్మాయి తప్పించుకొని మా ఇంటికి వచ్చిందన్నారు.

ఈ ఏడాది జూలై 10వ తేదీన పెళ్లి చేసుకొన్నారని రాణి చెప్పారు.  పెళ్లి చేసుకొన్న తర్వాతే ఆ విషయాన్ని వాళ్లు తనకు చెప్పారన్నారు.తన కొడుకు చాలా మంచివాడని ఆమె చెప్పారు. అవంతి కుటుంబసభ్యులే మంచివాళ్లు కాదన్నారు.

రాత్రి పూట తమకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేవారని ఆమె చెప్పారు. వాళ్లే తాగుబోతులు.. వారి గురించి ఈ కాలనీ వాళ్లను అడిగితే తెలుస్తోందన్నారు. అవంతి తల్లీదండ్రులు కఠినాత్ములన్నారు.

Also read:చందానగర్‌లో పరువు హత్య: 12 మంది అరెస్ట్

పెళ్లైన తర్వాత కాలనీ నుండి  వేరే చోటుకు వెళ్తే అమ్మాయిని తీసుకెళ్లారని అనుకొంటారని భావించి  అదే కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. పెళ్లైన తర్వాత మూడు నెలలుగా అవంతి, హేమంత్ ఎక్కడికి వెళ్లినా కూడ కలిసే వెళ్తున్నారని ఆమె చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?